కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ ని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తిరిగి ప్రారంభించారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఇన్నాళ్లు ఇంటికే పరిమితమైన పవన్ కళ్యాణ్ కూడా ముఖానికి మెరుగులుదిద్ది సెట్స్ లో మెరిసిపోతున్నారు. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో షూటింగ్ జరుగుతోంది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అటు తన జనసేన కార్యకర్తలకు.... ఇది తనను ఎంతగానో ఆరాధించే అభిమానులకు కాస్త దూరంగా ఉన్నారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు వకీల్ సాబ్ సినిమా షూటింగ్ తిరిగి మొదలు కావడంతో అడుగు బయట పెట్టిన పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు అందరూ షూటింగ్ స్పాట్ కు వచ్చి ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు.
వకీల్ సాబ్' సెట్స్ లోనే పవన్ జనసేన వ్యవహారాలు కూడా చెక్క పెడుతున్నట్లు తెలుస్తోంది.ఒక వైపు షూటింగ్ మరోవైపు జనసేన పార్టీ కార్యక్రమాలను చూసుకుంటూ పవన్ రెండింటినీ బ్యాలెన్స్ చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ దీని కారణంగా షూటింగ్ డిస్టర్బ్ అవుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.... కానీ పవర్ స్టార్ కు ఎక్కడ దేనికి ఎంత సమయం ఇవ్వాలో... ఎంత ప్రిఫరెన్స్ ఇవ్వాలో బాగా తెలుసని ఆయన అభిమానులు అంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి