ఇదిలా ఉంటే అసలు ఇక్కడ టిఆర్ఎస్ అభ్యర్థి ఓటమి తప్పదు అనే విషయం టిఆర్ఎస్ అగ్రనేతలు అందరికీ తెలుసునని, అందుకే కెసిఆర్ వ్యూహాత్మకంగా
కేసీఆర్ ను ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంచారని, ఓడిపోతే హరీష్ ను చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని టిఆర్ఎస్ పెద్దలు ముందుగానే ప్లాన్ చేసుకున్నారు అని, ఇలా ఎన్నో అంశాలు తెరపైకి వస్తున్నాయి.అది కాకుండా ఇక్కడ ఓటమి బాధ్యత మొత్తం తనదేనని హరీష చెప్పడంతో ఇంకా ఆయనపై సానుభూతి పెరిగిపోతోంది. టిఆర్ఎస్ లో హరీష్ రావు హవాను తగ్గించేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, దానిలో భాగంగానే దుబ్బాకలో ఓటమి బాధ్యతలు మొత్తం హరీష్ ఖాతాలో వేసి, ఆయనను బలిపశువు చేసేందుకు ఈ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారనే వ్యాఖ్యలు ఇప్పుడు టిఆర్ఎస్ నుంచి వినిపిస్తున్నాయి.
ఇదంతా కెసిఆర్ కుమారుడు
కేటీఆర్ కు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకునేందుకే, ఈ తతంగమంతా నడిపిస్తున్నారు అంటూ ఆయనపై సానుభూతి పవనాలు వీస్తున్నాయి. ఒకవేళ దుబ్బాక ఎన్నికలను సాకుగా చూపించి హరీష్ పై కెసిఆర్ ఏమైనా చర్యలు తీసుకున్నా, అది టిఆర్ఎస్ పార్టీకే తీరని నష్టం చేకూరుస్తుందనే విశ్లేషణలు ఇప్పుడు మొదలయ్యాయి.