భారీ తేడాతో ఓడిపోయాడు డోనాల్డ్ ట్రంప్. దాదాపు అమెరికన్లు... అమెరికాకు వలస వచ్చినవారు కూడా ఎక్కువగా జో బైడెన్ వైపు మొగ్గు చూపడంతో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఇక రెండవ సారి అధికారాన్ని చేజిక్కించుకుని అధ్యక్ష పీఠాన్ని అధిరోహించి పాలన కొనసాగించాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న ట్రంప్ ఆశలు తీరలేదు. కాగా ఓటమి చవి చూసిన తర్వాత ట్రంప్ పలుమార్లు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
గతంలో ఓసారి తాను ఓడిపోలేదని.. సిట్టింగ్ ప్రెసిడెంట్ కు ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా తనకు ఓట్లు వచ్చాయని... ఓట్ల లెక్కింపు రూమ్ లో ఏదో జరిగింది అంటూ అనుమానం వ్యక్తం చేశారు. తాజాగా ఇలాంటి తరహా వ్యాఖ్యలు చేశారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను ఓడిపోలేదు అంటూ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఓడిపోలేదని అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ 231 ఓట్లు సాధించగా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి 306 ఎలక్టోరల్ ఓట్లు సంపాదించాడు. మొత్తంగా ఐదు మిలియన్ లకు పైగా ఓట్లతో జో బైడెన్ విజయం సాధించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి