కరోనాకు అందరూ భయపడుతున్న రోజుల్లో ధైర్యం చేసి కెమెరా ముందుకు వచ్చిన హీరో నాగార్జున. బిగ్‌బాస్ 4 ప్రోమోతో మేకప్ వేసుకున్నాడు. ఆ తర్వాత వైల్డ్ డాగ్ షూట్‌లో పాల్గొని హిమాలయాలకు కూడా వెళ్లొచ్చాడు. మధ్యలో బిగ్‌బాస్ 4 సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించాడు. కరోనా సమయంలో కూడా కెమెరాముందు ఎక్కువ సేపు ఉన్న హీరో నాగార్జునానే.
నాగార్జున ఇచ్చిన ఇన్‌స్పిరేషన్‌తో స్టార్ హీరోలు ఒక్కొక్కరుగా ఇంటి నుంచి బయటకొచ్చారు. ప్రభాస్ అయితే.. ఏకంగా దేశం దాటేసి.. ఇటలీలో 20 రోజుల షెడ్యూల్‌ను ఆటంకం లేకుండా పూర్తి చేసుకొచ్చాడు. ప్రభాస్, పూజా పాల్గొన్న కొన్ని లవ్ సీన్స్ చిత్రీకరించాడు దర్శకుడు. ఆదిపురుష్ డిస్కషన్స్ కోసం ప్రస్తుతం ముంబయిలో ఉన్న ప్రభాస్ త్వరలో హైదరాబాద్‌లో జరిగే రాధే శ్యామ్ షూట్‌లో పాల్గొంటాడు.
రాజమౌళీకి కరోనా రావడంతో ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్ కాస్త లేటుగా మొదలైనా.. నాన్‌స్టాప్‌గా రన్ అవుతోంది. ఎక్కువమంది సిబ్బంది పాల్గొనడంతో.. ఈ భారీ మూవీ కోసం భారీగా జాగ్రత్తలు తీసుకున్నాడు నిర్మాత. ఎలాంటి ఆటంకాలు లేకపోతే.. ఫిబ్రవరి నాటికి షూట్ ఫినిష్ చేస్తారట. రామ్‌చరణ్‌తో జోడీ కడుతున్న అలియా భట్ డిసెంబర్‌లో సెట్స్‌పైకి రానుంది.
కరోనాకు వ్యాక్సిన్ వచ్చేవరకు ఆగుదామనుకున్న పవన్‌కల్యాణ్ కూడా.. వకీల్‌సాబ్ కోటు వేసుకుని వచ్చేశాడు. వకీల్‌సాబ్ పూర్తి కావడం ఆలస్యం.. క్రిష్ మూవీ లేదంటే.. అయ్యప్పనమ్ కోషియమ్ రీమేక్‌లో జాయిన్ అవుతాడు పవర్‌స్టార్. మొత్తానికి కరోనా సమయంలో కొందరు సిినిమా షూటింగుల్లో పాల్గొని తమ పనిని విజయవంతంగా పూర్తి చేసుకున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి