ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది. వెంటనే స్పందించిన భారత ఆర్మీ ఊహించని విధంగా పాకిస్తాన్ ను దెబ్బ కొట్టిన విషయం తెలిసిందే. వెంటాడి వేటాడి మరి పాకిస్తాన్ సైనికులను కాల్చి పడేసింది భారత సైన్యం. పాకిస్తాన్ సరిహద్దు దాటి ఐదు కిలోమీటర్లు లోపలికి వెళ్లి కాల్పులు జరపడంతో పాటు పాకిస్తాన్ ఊహించని విధంగా మిస్సైల్స్ ప్రయోగించి పాకిస్తాన్ ను చావుదెబ్బ కొట్టిన విషయం తెలిసిందే. దీంతో భారత్ కేవలం గన్స్ తో మాత్రమే దాడికి దిగుతుంది అని ఊహించిన పాకిస్థాన్‌కు భారత్ ఏకంగా మిస్సైల్స్ ప్రయోగించడంతో ఒక్కసారిగా బిత్తరపోయింది పాకిస్తాన్.
ఇక తాజాగా మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లుగా పాకిస్తాన్ ఇప్పటికే భారత దాడితో బెంబేలెత్తిపోతే ఇక ఇప్పుడు బెలూన్ ఆర్మీ రంగంలోకి దిగిన పాకిస్థాన్ పై దాడికి దిగింది. పాంచ్ గడ్ ప్రాంతంలో పాకిస్థాన్ సైనికులు వాహనాలపై బలూచ్ ఆర్మీ దాడి చేయడంతో భారీ సంఖ్యలో పాకిస్తాన్ సైనికులు మరణించినట్లు తెలుస్తోంది. దీంతో పాకిస్తాన్ ఊహించని విధంగా భారీ షాక్ తగిలింది. రానున్న రోజుల్లో పాకిస్తాన్ వైఖరి మార్చుకోకపోతే ఇలాంటి దాడులు మరిన్ని జరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి