భార్య భర్తల బంధం లో ఏర్పడిన మనస్పర్థల కారణంగా ఎంతోమంది మనస్తాపం చెంది ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు కూడా తెరమీదికి వస్తుంటే.. మరెంతో మంది ఏకంగా కట్టుకున్న వారిని దారుణంగా హత్య చేసిన సంఘటనలు కూడా తెర మీదికి వచ్చి సంచలనం సృష్టిస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఇలాంటి విషాదకర ఘటన జరిగింది. పెళ్ళైన కొన్నాళ్ల వరకూ బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత మాత్రం భర్త భార్యను వేధించడం మొదలుపెట్టాడు. తన బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక వివాహిత తనలో తానే కుమిలిపోతుంది. ఇక రోజు రోజుకు భర్త వేధింపులు ఎక్కువ అవుతూ వచ్చాయి.
దీంతో చివరికి మనస్థాపం చెంది ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడి నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగించిన విషాదకర ఘటన మెదక్ జిల్లా ఆందోల్ మండలంలో వెలుగులోకి వచ్చింది. సరిగ్గా ఏడాది క్రితం డాకూర్ గ్రామానికి చెందిన భాను అనే యువతికి.. గ్రామానికి చెందిన దేవయ్య అనే వ్యక్తితో వివాహం జరిగింది. కొన్నాళ్ళ వరకు బాగానే ఉన్నప్పటికీ గత కొన్ని రోజుల నుంచి భర్త మానసికంగా శారీరకంగా భార్యను వేధిస్తూ వచ్చాడు. రోజురోజుకు భర్త వేధింపులు ఎక్కువవడంతో చివరికి భర్త వేధింపులు తాళలేక మనస్తాపం చెందిన భార్య చున్నీ తో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి