జగన్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతుందో లేదోప్రతిపక్షాలు దాన్ని ఓర్వలేకపోతున్నాయి.. జగన్ వచ్చిన దగ్గరినుంచి ఎప్పుడెప్పుడు జగన్ ను పీఠం మీదనుంచి దింపి తాము ఆ కుర్చీ ఎక్కుదామా అని ఎదురుచూస్తూ జగన్ పై లేనిపోని విమర్శలు చేస్తూ ప్రజల తరపున పోరాడే పుణ్యకాలాన్ని పోగొట్టుకుంటున్నారు ప్రతిపక్ష నాయకులు.. అమరావతి విషయంలో తప్పా ప్రతిపక్ష నాయకులు ప్రజల తరపున పోరాడిన అంశం ఏమీ లేదు.. అది కూడా వారి సొంత ప్రయోజనాలకోసం చేశారు..

చంద్రబాబు అయితే ఇందులో జగన్ ఎంత బ్యాడ్ చేయాలనుకున్న చివరకికి తానే ప్రజలకు దూరమైపోయాడు..గతంలో ఏ ప్రతిపక్ష నాయకుడు చేయని విమర్శలను చంద్రబాబు చేస్తూ రాష్ట్రంలో గందరగోళం నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈమధ్య కొత్తగా జమిలి ఎన్నికలు వస్తాయని గట్టి నమ్మకం తో చెప్తున్నాడు.. అయితే చంద్రబాబు పడే పడే ఇలా అనడం ఇప్పుడు కొన్ని అనుమానాలకు దారి తీస్తుంది.. పార్టీ మీటింగ్ పెట్టినప్పుడలా మరో రెండేళ్లలో జమిలి ఎన్నికలు రాబోతున్నాయని అంతా సిద్ధంగా ఉండాలని పార్టీ క్యాడర్ ని ఉత్సాహపరుస్తున్నారు..

అయితే ఇదే ప్రణాళికను జగన్ కూడా ఆచరించడం ఆశ్చర్యంగా ఉంది. రెండు రోజుల మంగళగిరి పర్యటనలో బిజీబిజీగా పార్టీ కార్యకర్తలతో సమావేశం అయినా అయన ముందస్తు జమిలీ ఎన్నికలు వస్తాయని ప్రకటించారు.2024 కంటే ముందే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని.. ఈ మేరకు తనకు సమాచారం ఉందని పవన్ కల్యాణ్ ప్రకటించారు.దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలపై విస్తృతమైన చర్చ జరుగుతోది. ఒకే దేశం.. ఒకే విధానం.. బీజేపీ కాన్సెప్ట్. ఈ నినాదంతో జమిలీ ఎన్నికలు నిర్వహించడానికి వీలైనంత త్వరగా కసరత్తు పూర్తి చేసి 2022లోనే దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగింది. 2022లో జమిలీ ఎన్నికలు అనే ప్రతిపాదనకు ఓ ప్రాతిపదిక ఉంది. ఆ ఏడాది దాదాపుగా ఎనిమిది రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: