ఎంతోమంది క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలతో మనస్థాపం చెంది విలువైన ప్రాణాలను అర్ధాంతరంగా ముగిస్తూ ఉంటే.. ఇంకెంతో మంది క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలతో ఏకంగా సొంత వారి ప్రాణాలను సైతం తీసేస్తూ నేరస్థులుగా మారిపోతూ జైలు శిక్ష అనుభవిస్తున్న ఘటనలు చూస్తుంటే రానున్న రోజుల్లో సభ్య సమాజం తీరు ఎటు పోతుందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఇలాంటి దారుణం ఘటన వెలుగులోకి వచ్చింది. అన్నా అంటే తమ్ముడికి ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవాలి ఏదైనా కష్టం వస్తే వెన్నుతట్టి ముందుకు నడిపించాలి.
కానీ ఇక్కడ ఒక అన్న మాత్రం చిన్న కారణానికి ఏకంగా తమ్ముడి ప్రాణం తీసేసాడు. అన్న మొబైల్ డేటాను తమ్ముడు ఉపయోగించుకున్నాడు అన్న కారణంతో ఉన్మాదిగా మారి పోయినా అన్న సొంత తమ్ముడి ప్రాణాలను తీసేసిన దారుణ ఘటన రాజస్థాన్ లో వెలుగులోకి వచ్చింది. జోధాపూర్ కు చెందిన రామన్, రాయ్ అనే యువకులు అన్నదమ్ములు. కాగా ఇటీవలే అన్న రామాన్ కు తెలియకుండా అతని తమ్ముడు రాయ్ అన్న మొబైల్ డాటా ను వినియోగించుకున్నాడు. దీంతో కోపంతో ఊగిపోయిన అన్న తమ్ముడు తో గొడవ పడి ఏకంగా కత్తితో చాతిలో పొడిచాడు. దీంతో గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి