సాధారణంగా అయితే తల్లిదండ్రులు ఎవరైనా సరే తమ పిల్లలను సెల్ఫోన్ ఎక్కువగా వాడనివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటారు అన్న విషయం తెలిసిందే. ఇక సెల్ఫోన్ వాడితే చదువును పక్కనపెట్టి సెల్ ఫోన్ కి బానిస గా మారి చివరికి చెడు అలవాట్లు దరిచేరే అవకాశం ఉంటుంది అని భావించే తల్లిదండ్రులు పిల్లలను ఎక్కువగా సెల్ ఫోన్ కి దూరంగానే ఉంచుతున్నారు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం అంతా తారుమారు అయిపోయింది. కరోనా  వైరస్ నేపథ్యంలో ప్రస్తుతం తల్లిదండ్రులకు పిల్లలకు సెల్ ఫోన్ లు ఇస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఆన్లైన్ క్లాసులు జరుగుతున్న నేపథ్యంలో మొబైల్ కంప్యూటర్ల వాడకం ఎక్కువగా అవుతుంది.



 దీంతో గంటల తరబడి పిల్లలు సెల్ఫోన్ వాడుతున్నప్పటికీ.. ఆన్లైన్ లో కాలం గడుపుతున్నప్పటికి కూడా తల్లిదండ్రులు ఏమీ అనలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఇలాంటి క్రమంలోనే ఎంతో మంది పిల్లలు చెడు దారి లో నడిచే అవకాశం కూడా ఉంది అన్న విషయం తెలిసిందే. అసభ్యకరమైన నోటిఫికేషన్స్ పిల్లలను ఆకర్షించేందుకు అవకాశం ఉంటుంది. అందుకే పిల్లలకు ఆన్లైన్ క్లాసులు నేపథ్యంలో ఫోన్ ఇచ్చినప్పటికీ తల్లిదండ్రులు మాత్రం ఆందోళనలోనే  ఉంటూన్నారు . కాగా ప్రస్తుతం ఇలాంటి వాటి అన్నింటికీ కూడా చెక్ పెట్టేందుకు ప్రస్తుతం సరికొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది.



 ఆన్లైన్ క్లాసులు వింటున్న  సమయంలో మొబైల్స్ కంప్యూటర్లు వాడుతున్న పిల్లలు అసభ్యకరమైన వెబ్సైట్లను క్లిక్ చేయకుండా ఉండేందుకు ప్రస్తుతం సరికొత్త యాప్ తెరమీదికి వచ్చింది. ఈ యాప్ ద్వారా పిల్లల ఫోన్ లకి వచ్చి మెసేజ్ లకు సంబంధించిన నోటిఫికేషన్లు తల్లిదండ్రుల ఫోన్ లకి వస్తూ ఉంటాయి. ఇక ఈ యాప్ పేరే వాచ్ ఫాల్కన్ పేరెంట్. ఇందులోని రోగ్ ట్రాకర్ ఆప్షన్ తో  పిల్లల సెల్ ఫోన్ లకి వచ్చే  అసభ్యకరమైన నోటిఫికేషన్లను బ్లాక్ లేదా డిలీట్ చేసే అవకాశం ఉంటుంది. బెంగళూరు సాంకేతిక సదస్సులో ఈ విషయాన్ని వెల్లడించారు శాస్త్రవేత్తలు.

మరింత సమాచారం తెలుసుకోండి: