ప్రస్తుతం ప్రపంచంలోనే ఎక్కువ పర్యాటక ప్రాంతాలు కలిగిన దేశం ఏది అంటే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు టర్కీ . అలాంటి టర్కీలో ప్రస్తుతం ప్రభుత్వ తీరుతో రోజురోజుకూ టర్కీ అయోమయంలో పడిపోయింది. మొన్నటికి మొన్న పాకిస్తాన్ ను  వెంటబెట్టుకొని భారత్తో వివాదానికి తెరలేపింది. ఆధిపత్యం సాధించేందుకు ప్రయత్నించింది.  వెంటనే అప్రమత్తమైన భారత్ పై పలు ఆంక్షలు విధించడంతో  వ్యాపారపరంగా టర్కీ కి భారీ షాక్ తగిలింది అని చెప్పాలి. ఇక మరో వైపు ఫ్రాన్స్  తో కూడా టర్కీ వివాదానికి తెర లేపడం తో ఫ్యాన్స్ కూడా కఠిన ఆంక్షలు విధించడంతో ప్రస్తుతం టర్కీ అయోమయంలో పడిపోయింది అన్న విషయం తెలిసిందే.



 మరోవైపు యూరోపియన్ దేశాల వైపు నుంచి కూడా టర్కీ పై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇక ఇటీవలే అజర్బైజాన్ తో కలిసి ఆర్మేనియా పై యుద్ధం చేసేందుకు మద్దతుగా నిలవడంతో అటు  రష్యా కూడా టర్కీ దేశాన్ని పూర్తిగా తమ దృష్టిలో నుంచి పక్కకు పెట్టేసింది అన్న  విషయం తెలిసిందే. ఇలా తాను ఒక హీరో అని నిరూపించుకోవడానికి ప్రపంచ దేశాల పై ఆధిపత్యం సాధించుకోవాలి అనుకున్న టర్కీ కి  అడుగడుగునా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ప్రస్తుతం అన్ని వైపుల నుంచి దారులు మూసుకుపోయాయి.



 టూరిజం కేంద్రం కాస్త ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి విలవిలలాడుతోంది టర్కీ. దీంతో ప్రస్తుతం తీవ్ర మైనటువంటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీంతో అక్కడ కరెన్సీ మారకం విలువ కూడా పూర్తిగా తగ్గిపోయింది. ఈ క్రమంలో ఇటీవల టర్కీ అధ్యక్షుడు కీలక స్టేట్మెంట్ ఇచ్చారు. నేను కూడా ఒక యూరోపియన్ యూనియన్  భాగస్వామి అని గుర్తించాలి అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇలా తమను కూడా యూరోపియన్ యూనియన్లో ఒక దేశంగా  గుర్తించండి అని యూరోపియన్ దేశాలకు రిక్వెస్ట్ చేయకుండా టర్కీ ఏకంగా అడుక్కోవడంలో  కూడా బుద్ది  పోనివ్వలేదు  అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: