కొన్ని కొన్ని సార్లు రాజకీయ నాయకులు చేసే వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతూ  రాజకీయాలను ఒక్కసారిగా ఊపేస్తూ ఉంటాయి అనే విషయం తెలిసిందే. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంత మంది రాజకీయ నాయకులు పోలీసుల విషయంలో చేసిన వ్యాఖ్యలు  చర్చనీయాంశంగా మారి పోవడమే  కాదు స్వయంగా పోలీసులు వార్నింగ్ లు ఇచ్చేంత వరకు  దారితీశాయి. ఇక ఇటీవలే పశ్చిమ బెంగాల్లో కూడా ఓ బిజెపి నేత పోలీసులను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బిజెపి నేత చేసిన వ్యాఖ్యలు కాస్త సంచలనంగా మారిపోయి పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయాయి.



 సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు అధికార పక్షంపై విమర్శలు గుప్పించడం మామూలే అదే సమయంలో అధికార పక్షానికి అనుకూలంగా ఉన్నారు అని ఆయా రాష్ట్రాల పోలీసు వ్యవస్థపై కూడా ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. ఇవి తరచూ మనం చూస్తూనే ఉంటాం. అయితే ఇలా విమర్శలు గుప్పించడం ఒక లిమిట్ ప్రకారం ఉంటే బాగానే ఉంటుంది కానీ లిమిట్ దాటి విమర్శలు చేస్తే మాత్రం అది కొత్త సమస్యలను తెచ్చి పెడుతుంది అన్న విషయం తెలిసినదే.  ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది. ఏకంగా తాము అధికారంలోకి వచ్చాక పోలీసులను బూట్లు నాకిస్తాము  అంటూ బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారి పోయాయి.



 ఓ కార్యక్రమంలో పాల్గొన్న పశ్చిమ బెంగాల్ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ రాజు బెనర్జీ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ప్రజల రక్షణ ని వదిలేసి ప్రభుత్వం చెప్పినట్లుగానే పోలీసులు పనిచేస్తున్నారు అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులు ను బూట్లు నాకిస్తాం అంటూ వ్యాఖ్యానించారు. పశ్చిమబెంగాల్లో గుండాల రాజ్యం పెరిగిపోయింది అంటూ వ్యాఖ్యానించిన పశ్చిమ బెంగాల్ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ రాజు బెనర్జీ... పోలీసులు నేరాలను అరికట్ట కుండా ప్రభుత్వంకి తొత్తులుగా పని చేస్తున్నారని అలాంటి పోలీసులను తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేద్దాం బూట్లు నాకిద్దాం  అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: