సాధారణంగా ఒక దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి ఏదైనా మాట్లాడేటప్పుడు వెనకాముందు ఆలోచించి  ఎంతో ఆచి తూచి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఏ మాత్రం నోరు జారి మాట్లాడిన అది ఏకంగా  సంచలనంగా మారిపోతూ ఎన్నో విమర్శలకు తావిస్తోంది అనే విషయం తెలిసిందే. ముఖ్యంగా దేశ అధ్యక్షుడి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడే ప్రతి మాటలో కూడా ఒక అర్థం ఉండాలి. కాగా ఇటీవలే ఇజ్రాయిల్ ప్రధాని చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది ఇజ్రాయిల్ ప్రధాని చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం ప్రపంచ మహిళా లోకం మొత్తం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా మహిళలను పశువులతో పోలుస్తూ ఇజ్రాయిల్ ప్రధాని ప్రస్తుతం సంచలన వ్యాఖ్యలు చేశారు.



 ఇది కాస్త ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది. మహిళలందరూ హక్కులు ఉన్న జంతువులు అంటూ ఇజ్రాయిల్ ప్రధాని నేతన్యాహు  కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇది కాస్త ప్రస్తుతం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఇజ్రాయిల్ ప్రధాని స్పందించి ఎలాంటి  వివరణ ఇవ్వడం లాంటివి మాత్రం జరగలేదు అని చెప్పాలి. ఇంతకీ అసలు ఇజ్రాయిల్ ప్రధాని ఏం మాట్లాడారు అని అంటారా... ఇటీవలే ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ ఎగైనెస్ట్ ఉమెన్ అనే కార్యక్రమం నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఇజ్రాయిల్ ప్రధాని నేతన్యాహు.



 ఈ సందర్భంగా ప్రసంగించిన ఇజ్రాయిల్ ప్రధాని కీలక వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం సంచలన గా మారిపోయింది. మనమందరం జంతుహింస తగదు అని ఎప్పుడూ చెబుతుంటామూ  అంటూ ఆయన వ్యాఖ్యానించారు. జంతువుల మీద ఎంతో ఆప్యాయత  చూపిస్తూ ప్రేమ కురిపిస్తూ ఉంటామూ  అంటూ చెప్పుకొచ్చారు. అయితే మహిళలు పిల్లలు కూడా జంతువులే అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకపోతే వారు హక్కులు ఉన్న జంతువులు అంటూ కామెంట్ చేయడం ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది. ప్రస్తుతం ఇజ్రాయిల్ ప్రధాని చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారగా ఎంతో మంది నెటిజన్లు ఆయన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: