తెలంగాణ  రాష్ట్రంలో కేసీఆర్ ఎదురులేకుండా పరిపాలన సాగిస్తున్నాడు.. రెండు సార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కి రాష్ట్రంలో ఇప్పటికీ ఎక్కడ కూడా ఎదురులేదు.. సరైన ప్రతిపక్షం లేకపోవడం ఉన్నా అందులో నాయకులు చాలా డల్ గా ఉండడంతో రెండో సారి కేసీఆర్ అధికారంలోకి వచ్చి ప్రజలలో మంచి పేరును సంపాదిస్తూ ముందుకు వెళ్తున్నాడు.. అయితే రెండో సారి పరిస్థితి లు మొదటిసారి ఉన్నట్లు లేవని చెప్పాలి.. కొంతమంది నాయకులు ఈ గ్యాప్ లో ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు, కేసీఆర్ పై కూడా ప్రజల్లో కొంత వ్యతిరేకత కనిపిస్తుంది..

కరోనా విషయంలో కేసీఆర్ కి ప్రజల మధ్య దూరం పెరిగిపోయిందని చెప్పొచ్చు.. అంతేకాదు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా తన దూకుడు పెంచడంతో కేసీఆర్ కి కొంత తలనొప్పి మొదలైనమాట వాస్తవం.. ప్రతి దానికి లెక్క అడుగుతూ ప్రజల తరపున అడుగుతున్నామని చెప్తూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టె ప్రయత్నం చేస్తున్నారు.. దీనికి దుబ్బాక ఫలితం కూడా తోడయ్యి కేసీఆర్ ని మరింత ఇబ్బంది పెట్టేస్తున్నారు బీజేపీ నేతలు.. దుబ్బాక లో వచ్చిన ఉత్సాహంతో బీజేపీ గ్రేటర్ గెలుపు కోసం ప్రయత్నిస్తుంది..

అయితే బీజేపీ దూకుడు ను చూసి కేసీఆర్ లో కొంత గుబులు మొదలయిందని చెప్పొచ్చు.. గతంలో ఎన్నడూలేనంతగా కేసీఆర్ పై వారు తీవ్ర వ్యతిరేకత ను తీసుకొచ్చారు.. అంతేకాదు ఇన్నాళ్లు కుక్కిన పేనుల్లా పడి ఉన్న సొంత పార్టీ నేతలు కూడా ఇప్పుడు స్వరం పెంచుతున్నారట.. ఇదే కొనసాగితే పార్టీ లో అసంతృప్తి నేతలు ఎక్కువై పార్టీ రాజకీయ భవిష్యత్ పై ప్రభావం పడేలా ఉంటుందని గ్రేటర్ ఎన్నికల్లో ఎగురవేసే విజయబావుటా వీటన్నిటికీ సమాధానం లా ఉండాలని ఎలాగైనా గ్రేటర్ లోవిజయాన్ని కైవసం చేసుకోవాలని చూస్తున్నారట.. అందుకే అభ్యర్థుల జాబితాను కూడా దగ్గరుండి పరిశీలించారు. అసంతృప్తిని ఎదుర్కొంటున్న కార్పొరేటర్లకు తిరిగి టిక్కెట్ ఇవ్వలేదు. ఇప్పటి వరకూ బీజేపీ పై కొంత నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్న కేసీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం అలా చేయకూడదని నిర్ణయించుకున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వాన్ని నిత్యం టార్గెట్ చేస్తున్నారు. మరి జీహెచ్ఎంసీ ఎన్నికలు కేసీఆర్ కు ఎలాంటి ఫలితాలు అందిస్తాయో వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: