పాకిస్తాన్ లో  రోజు రోజుకు పరిస్థితులు హాట్ హాట్ గా మారిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. భారత్లో విధ్వంసాలు సృష్టించి భారత్ను తమ అధీనంలోకి తెచ్చుకుని... మత రాజ్య స్థాపన చేయాలి అనుకుంటున్నా పాకిస్థాన్కు భారత్ నీ దెబ్బ తీయడం దేవుడెరుగు ఏకంగా ప్రస్తుతం పాకిస్థాన్ నాశనమయ్యే పరిస్థితి  వస్తుంది. ఓవైపు సరిహద్దుల్లో తోక జాడిస్తే పాకిస్థాన్కు ఎంతో దీటుగా బుద్ధి చెబుతున్న భారత్.. ఉగ్రవాదుల అందరినీ ఎక్కడికక్కడ ఏరి పారేస్తున్న విషయం తెలిసిందే. ఇక భారత్ ఎదురుదాడి తోనే వణికిపోతున్న పాకిస్తాన్ కి ఇప్పుడు మరో కొత్త సమస్య కూడా వచ్చి పడుతుంది.



 ఇటీవలే పాకిస్తాన్ లోని పలు ప్రాంతాల ప్రజలు ఏకంగా పాకిస్తాన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉద్యమాల బాట పడుతూ ఉండటం కూడా సంచలనంగా మారిపోతుంది. బెలూచిస్థాన్ గిల్గిట్ బాల్టిస్థాన్ సింధు ప్రాంతాల ప్రజలు తమను భారత్ లో కలపాలని పాకిస్తాన్ లో  ప్రస్తుతం తీవ్రస్థాయిలో ఉద్యమాల బాట పడుతున్నారు. ప్రస్తుతం ఇది కాస్త పాకిస్తాన్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవల సీనియర్ రిటైర్డ్ పాకిస్తాన్ ఆర్మీ అధికారులు పాకిస్తాన్ ప్రభుత్వానికి ఓ నివేదిక ఇచ్చారు.



 భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పై పాకిస్తాన్ ఒక కన్ను వేసి ఉంచాలి అంటూ సూచించారట. అజిత్ దోవల్ వ్యూహాల వల్లనే పాకిస్తాన్ లో ఇన్ని సమస్యలు తలెత్తుతున్నాయి అంటూ లేఖలో పేర్కొన్నారట సీనియర్ రిటైర్డ్ ఆర్మీ అధికారులు. అజిత్ దోవల్ కి ఆణువణువూ  తెలుసని.. అంతే కాకుండా మోసబ్ లాంటి వాళ్ళతో బాగా అజిత్ దోవల్ స్నేహం చేసాడు కాబట్టి... దోవల్ తో  కాస్త జాగ్రత్తగా ఉండాలి అంటూ సూచించారట. బెలూచిస్తాన్ గిల్గిట్ బాల్టిస్థాన్ లాంటి ప్రాంతాలలో అజిత్ ధోవల్ ఎత్తు కారణంగానే  అక్కడి ప్రజలు తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉద్యమ బాట పట్టారు అని ఇటీవలే పాకిస్తాన్ అధికారులు ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: