జిహెచ్ఎంసి ఎన్నికల ను టిఆర్ఎస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకం గా తీసుకున్న విషయం తెలిసిందే.  మొన్నటికి మొన్న జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుస్తామని  ఎంతో ధీమా తో ఉన్న టిఆర్ఎస్ పార్టీకి బిజెపి గెలిచి భారీ షాకిచ్చింది ఈ క్రమం లోనే  జిహెచ్ఎంసి ఎన్నికలు బిజెపికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు ప్రస్తుతం ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకం గా తీసుకున్న టిఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకం గా అడుగులు వేస్తోంది. ఈ క్రమం లోనే అభ్యర్థులందరూ ఓటర్లను ఆకట్టుకునేందుకు కుమ్మరు ప్రచారం నిర్వహిస్తున్నారు.



 ఇక ఇటీవల జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారం లో భాగంగా టిఆర్ఎస్ పార్టీలోని మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కలిసి జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఆయా డివిజన్ల లో పోటీ చేస్తున్న అభ్యర్థులు అందరికీ మద్దతుగా ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తమ ప్రసంగాలు ఇస్తున్నారు. దీంతో ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో ఎక్కడ చూసినా కూడా ఎన్నికల ప్రచారం హోరు  కనిపిస్తోంది అనే విషయం తెలిసిందే. ఇటీవలే కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని సూరారం డివిజన్ పరిధిలో మారుతి మెడికల్ దగ్గర టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మద్దతుగా ప్రచారం నిర్వహించారు.



 టిఆర్ఎస్ అభ్యర్థి సత్యనారాయణ కు మద్దతుగా తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్... మరో మంత్రి మల్లారెడ్డి కలిసి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా భారీ రోడ్ షో  నిర్వహించారు. రోడ్ షో లో టిఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న ఇద్దరు మిత్రులు కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏవిధంగా అభివృద్ధి చేస్తుంది అనే విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి  ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించారు. టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. అంతేకాకుండా ఇప్పటి వరకు రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాల గొప్పతనాన్ని కూడా ప్రజలకు వివరిస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: