హైదరాబాద్ రాజేంద్రనగర్ ప్రవీణ అనే 19 ఏళ్ల యువతి ప్రస్తుతం ఇంటర్ చదువుతోంది. కుటుంబంతో కలిసి పాండురంగ నగర్ లో నివాసం ఉంటుంది. అయితే శ్రీ గాయత్రి జూనియర్ కళాశాల ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న ప్రవీణకూ... శ్రీకాంత్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది ఇక ఆ తర్వాత శ్రీకాంత్ అనే యువకుడితో పరిచయం కాస్త ప్రేమగా మారి పోయింది. అయితే హైదర్గూడా లో ఒక గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు శ్రీకాంత్. అప్పుడప్పుడు ప్రవీణ శ్రీకాంత్ ను కలిసేందుకు గదికి వెళ్లి వచ్చేది.
ఈ క్రమంలోనే ఇటీవలే తన స్నేహితుడి ఎంగేజ్మెంట్ ఉంది అంటూ ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పిన ప్రవీణ్ శ్రీకాంత్ ను కలిసేందుకు గదికి వెళ్ళింది. శ్రీకాంత్ గదిలో లేకపోవడంతో ఫోన్ చేయగా తన సొంత ఊర్లో ఉన్నాను అంటూ చెప్పాడు. ఇక ఆ తర్వాత శ్రీకాంత్ రాత్రి హైదరాబాద్ తిరిగి వచ్చి గది తలుపులు తెరిచే సరికి ఒక్కసారిగా షాక్. సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకొని ప్రవీణ వేలాడుతూ కనిపించింది. వెంటనే అతడు పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి