ప్రస్తుతం భారత్  దౌత్య పరంగా ఎంతో సమర్థవంతంగా ముందుకు సాగుతుంది అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం భారత దౌత్య పరంగా దూకుడుగా వ్యవహరిస్తున్న తీరు ప్రపంచ దేశాలను సైతం ఆకర్షిస్తోంది. ఓవైపు శత్రు దేశాలకు దీటుగా బదులిస్తోంది. మరోవైపు ఇతర దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను మెరుగు పరుచుకుంటూ ముందుకు సాగుతుంది భారత్. ఈ క్రమంలోనే ప్రస్తుతం సౌదీ అరేబియా లాంటి దేశాల్లో భారత్  తో మరింత బలమైన బంధాలను ఏర్పరచుకునేందుకు సిద్ధమవుతున్నది అన్న విషయం తెలిసిందే. అయితే సౌదీ అరేబియా తో భారత్ బంధం రోజురోజుకు మరింతగా బలపడుతుంది




 సౌదీ అరేబియా ఇస్లామిక్ దేశం అయినప్పటికీ మరో ఇస్లామిక్ దేశమైన పాకిస్థాన్ దాయాది దేశమైన భారత్ తో ఎంతగానో సత్ సంబంధాలు మెరుగు పరుచుకుంటూ ఉంది. అదే సమయంలో ఇస్లామిక్ దేశమైన పాకిస్థాన్ తో మాత్రం పూర్తిగా సంబంధాలను తెంచుకుంది  అన్న విషయం తెలిసిందే. ఇక రోజు రోజుకు సౌదీ అరేబియా భారత్ మధ్య ఎన్నో దౌత్య పరమైన వాణిజ్యపరమైన ఒప్పందాలు కూడా జరుగుతూ ఉండటం ఒక శుభ పరిణామం అని చెప్పాలి.



 సౌదీ అరేబియా నరేంద్ర మోడీ అంటే అపారమైన ప్రేమ చూపిస్తుంది. సౌదీ అరేబియా ప్రస్తుతం భారత్ సంబంధాలు మెరుగు పరుచుకుంటూ ఉండడంతో అటు  అరబ్ కంట్రీస్ అన్ని  కూడా భారత్కు మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలోనే సౌదీ అరేబియా కీలకమైన నాలుగు అడుగులు ముందుకు వేసింది. కాశ్మీర్ ఇష్యూపై పాకిస్తాన్ మాట చెల్లుబాటు కాకుండా చేసింది సౌదీ. సౌదీ అరేబియాకు  వచ్చే పాకిస్తాన్ పౌరులకు వీసా  పై ఆంక్షలు పెట్టిన సౌదీ భారత్ పై మాత్రం పూర్తి ఆంక్షలను తొలగించింది. మరొకటి ప్రస్తుతం పాకిస్తాన్కు అప్పు ఇవ్వడం మానేసి ఇచ్చిన అప్పు తిరిగి చెల్లించాలంటూ వత్తిడి తీసుకు వస్తుంది. అంతేకాకుండా గిల్గిట్ బాల్టిస్థాన్ ప్రాంతం పాకిస్తాన్లో లేదు అన్నట్లు తమ అధికారిక మ్యాప్ లో  చూపిస్తుంది సౌదీ అరేబియా. ఇలా దౌత్యపరంగా భారత్ విజయవంతమైనదని  విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: