ఈ క్రమంలోనే ఇక దుబ్బాక ఉప ఎన్నికలు ముగిసిన వెంటనే జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికలలో కూడా తప్పనిసరిగా భారీ మెజారిటీ సాధించి మేయర్ పీఠాన్ని దక్కించుకుంటాం అని బిజెపి ధీమాతో ఉంది. దీని కోసం బీజేపీ అభ్యర్థులు అందరూ కూడా ప్రచారం చేపట్టారు అధికార టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎంతగానో ప్రయత్నించారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రస్థాయిలో కసరత్తు చేశారు. అయితే జిహెచ్ఎంసి ఎన్నికల్లో విజయమైనా ఓటమి అయినా బిజెపి కి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అని ప్రస్తుతం విశ్లేషకులు అంటున్నారు.
ఒకవేళ దుబ్బాకలో జరిగినట్లుగానే జీహెచ్ఎంసీ ఎన్నిక లో కూడా బిజెపి భారీ మెజారిటీ సాధించి మేయర్ పీఠాన్ని దక్కించుకుంది అంటే ఇక తెలంగాణ ప్రజానీకం మొత్తం టిఆర్ఎస్ పాలనతో విసిగిపోయి బిజెపి ని గెలిపించడానికి రెడీగా ఉన్నారు అని అర్థం చేసుకోవచ్చు అని చెబుతున్నారు విశ్లేషకులు. ఒకవేళ భారీ మెజారిటీ సాధించినప్పటికీ మేయర్ పీఠాన్ని దక్కించుకొక పోతే.. రానున్న రోజుల్లో బిజెపి బలపడానికి మరింత అవకాశం ఉంది అని అర్థం చేసుకోవచ్చు అని విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ ఎలాంటి మెజారిటీ సాధించకుండా ఓటమి చవి చూస్తే... ఇక బీజేపీ తెలంగాణ లో పాగా వేయడానికి చాలా కష్టపడాల్సి ఉంది అని అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు అంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి