జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ ఊసరవెల్లి అంటూ , సినీ నటుడు ప్రకాష్ రాజ్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే . ఈ వ్యాఖ్యల పై పెద్ద దుమారమే చెలరేగింది. ప్రకాష్ రాజ్ ను టార్గెట్ చేసుకుంటూ పవన్ ఫ్యాన్స్, జన సైనికులు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఇక పవన్ సోదరుడు నాగబాబు ఓ రేంజ్ లో ప్రకాష్ రాజ్ పై మండిపడుతూ, ఆయనకు గట్టి కౌంటర్ ఇచ్చారు. అసలు పవన్ కళ్యాణ్ ను ప్రకాష్ రాజ్ ఈ స్థాయిలో విమర్శలు చేయడానికి ప్రధాన కారణం పవన్ బిజెపి తో సన్నిహితంగా మెలగడమే. దీంతో పవన్ ప్రకాష్ రాజ్ మధ్య ఉప్పు నిప్పు అన్నట్లుగా వాతావరణం నెలకొంది. 


ఇది ఇలా ఉంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ అనే సినిమాలో ప్రకాష్ రాజ్ సైతం కీలక పాత్రను పోషిస్తున్నారు .త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్న సందర్భంగా , పవన్ , ప్రకాష్ రాజ్ ఇద్దరు ఒక చోట కలిసే అవకాశం ఉండడంతో, సర్వత్ర ఈ వ్యవహారం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే పవన్ ప్రకాష్ లపై కొన్ని సీన్లను చిత్రీకరించారు. 



మరి కొన్ని సీన్లను చిత్రీకరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సుమారు నాలుగు రోజుల పాటు పవన్ ప్రకాష్ రాజ్ మధ్య కొన్ని సన్నివేశాలను చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో,.  ఇద్దరు ఒకే చోట కలిస్తే ఒకరికొకరు పలకరించుకుంటారా  లేక ఎడమొహం పెడమొహం అన్నట్లుగా వ్యవహరిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.




మరింత సమాచారం తెలుసుకోండి: