ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. ప్రముఖ అధికార వైయ్యసార్ కాంగ్రెస్ పార్టీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి  తెలుగు దేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడుపై  సంచలన కామెంట్స్ చెయ్యడం జరిగింది. చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలో  ఎక్కడ పోటీ చేసినా గెలవలేరని చెప్పారు. చంద్రబాబు మళ్లీ గెలిస్తే నేను రిటైర్మెంట్ తీసుకుంటానేమో.. నాకే తెలియదు అని అన్నారు. ఆదివారం శ్రీకాళహస్తిలో జరిగిన నవరత్నాల విజయోత్సవ సభలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై సంచలన కామెంట్స్ చేశారు.

చంద్రబాబు నాయుడుకు దమ్ముంటే ఈసారి పీలేరు, పుంగనూరు, తంబళ్లపల్లి స్థానాల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేసి గెలవాలని మంత్రి పెద్దిరెడ్డి సవాల్ విసిరారు. ఆయన కుప్పంలో పోటీ చేసినా ఓడిపోతారంటూ జోస్యం చెప్పారు.పర్సంటేజీలు తీసుకుని పనులు చేయని మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ అంటే గిట్టని వారు టీడీపీలోనే ఎంతో మంది ఉన్నారని అన్నారు. kishore kumar REDDY' target='_blank' title='నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి వాహనాలపై వాళ్ల పార్టీ వారే దాడులు చేశారని చెప్పారు.

కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవని నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి టీడీపీలో చంద్రబాబు జాతీయ స్థాయి పదవి ఇచ్చారని కామెంట్ చేశారు.అలాగే తంబళ్లపల్లిలో టీడీపీ నేతలపై దాడి ఘటనపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఆ ఘటనతో వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేయడం జరిగింది.ఇక ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: