ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి రోజురోజుకి ప్రజల అభిమానాన్ని పొందుతున్నారు. అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే అనేక అభివృద్ధి కార్యకలాపాలు మొదలు పెట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు ఇక తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లోని  తల్లిదండ్రులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభ వార్త చెప్పారు. సంక్రాంతి బహుమతి ఇవ్వటానికి సిద్ధమయ్యారు. సంక్రాంతి పండుగకు ముందు జనవరి 9వ తేదీన ఆంధ్ర ప్రదేశ్  రాష్ట్రం అంతటా  ఉన్న తల్లుల అకౌంట్లలో ‘జగనన్న అమ్మ ఒడి’ డబ్బు జమ చేయనున్నట్లు ప్రకటించడం జరిగింది. రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ జగనన్న అమ్మ ఒడి పథకం వర్తింపజేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.అందుకు  సోమవారం మంత్రి సురేష్ మీడియాతో మాట్లాడుతూ.. జనవరి 9వ తేదీన జగనన్న అమ్మ ఒడి పథకం రెండో విడత చెల్లింపులు చేస్తామని ప్రకటించారు.

పూర్తి పారదర్శకంగా అమ్మఒడి పథకం లబ్దిదారులను ఎంపిక చేస్తామన్నారు. గతేడాది 43,54,600 మంది లబ్ధిదారులకు ‘అమ్మ ఒడి’ కింద రూ. 6,336 కోట్లు పంపిణీ చేసినట్లు మంత్రి వివరించారు. జగనన్న అమ్మ ఒడి పథకం కింద ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో రూ. 15,000 డబ్బు జమ చేస్తున్న విషయం తెలిసిందే.  ఈ విధంగా మంత్రి సురేష్ మాట్లాడారు.. ‘‘అమ్మ ఒడి పొందేందుకు ఈ నెల 10 నుంచి 20 వరకు విద్యార్థుల రిజిస్ట్రేషన్లు.. ఈ నెల 16 నుంచి 19 వరకు లబ్ధిదారుల ప్రాథమిక జాబితా ప్రదర్శన.. ఈ నెల 20 నుంచి 24 వరకు జాబితాలో తప్పుల సవరణకు అవకాశం. ఈ నెల 26న అమ్మ ఒడి లబ్దిదారుల ఫైనల్ లిస్టు ప్రదర్శన. ఈ నెల 31న జాబితాపై అన్ని జిల్లాల కలెక్టర్ల ఆమోదం.’’ ఇలా దశల వారీగా అర్హులందరికీ న్యాయం చేస్తాయని మంత్రి సురేష్ మాట్లాడారు. ఇక ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: