అత్యంత పాశవికంగా గర్భవతిని హత్య చేసింది... దారుణంగా హత్య చేయడమే కాదు కడుపులోని పేగులు కోసి ఏకంగా ఎనిమిది నెలల పసికందు ని బయటకు తీసింది.. పసికందు ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడినప్పటికీ చివరికి గర్భవతి మాత్రం మరణించింది. ఈ క్రమంలోనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లీసా మౌంట్ గోమేరీ ని అరెస్టు చేశారు. ఇక ఆ తర్వాత 2004 నుంచి ఈ హత్యకు సంబంధించిన కేసు కోర్టులో విచారణ జరుపుతూవచ్చింది. ఈ క్రమంలోనే కోర్టు సదరు మహిళకు మరణ శిక్ష విధించింది. కాగా జనవరి 8వ తేదీన సదరు మహిళకు ఉరిశిక్ష అమలు కావాల్సి ఉన్నప్పటికీ... అటార్నీ లకు కరోనా వైరస్ సోకడంతో జనవరి 12 కు ఆమె ఉరిశిక్ష వాయిదా వేశారు. కాగా 1953లో ఇలా అమెరికాలో ఒక మహిళకు ఉరిశిక్ష వేయబడింది.
ఒక ఇప్పుడు దాదాపు 67 ఏళ్ల తర్వాత అమెరికా చరిత్రలో ఇలా రెండవసారి మహిళకు ఉరిశిక్ష అమలు కానున్నట్లు తెలుస్తోంది. అయితే సదరు మహిళ యొక్క ఉరిశిక్షను ఆపాలి అంటూ వైట్హౌస్ ను డిమాండ్ చేస్తూ కొందరు న్యాయవాదులు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఓవైపు సదరు మహిళ మానసిక శారీరక వ్యాధులతో బాధ పడుతుంది అంటూ కోర్టులను ఆశ్రయించారు ఆమె తరపు న్యాయవాది. ఒకవేళ కోర్టులు సదరు మహిళకు పడిన మరణశిక్షను వాయిదా వేస్తే ఇక ఆ తర్వాత అధికారంలోకి వచ్చే అధ్యక్షుడు మరణశిక్ష పడిన ఖైదీల ను ఒక్క ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తో రద్దు చేయడానికి అవకాశం ఉంటుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి