అయితే ప్రస్తుతం ఢిల్లీ సరిహద్దుల్లో వేల సంఖ్యలో రైతులు ఉద్యమం చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. అదే సమయంలో రైతులు తమ ఆవాసాలను కూడా రహదారుల పైన ఏర్పాటు చేసుకొని.. చలికి వణుకుతూ ఎండకు ఎండుతూ అక్కడే నిరసనలు ఆందోళనలు చేపడుతున్నారు. అంతేకాదు చలికి తట్టుకోలేక ఎంతో మంది రైతులు అనారోగ్యం బారిన పడి ప్రాణాలు వదులుతున్నారు. అయితే రోజురోజుకు రైతులు చేపడుతున్న ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అటు ప్రతిపక్ష పార్టీల నుంచి స్వచ్ఛంద సంఘాల నుంచి కూడా రైతుల ఉద్యమానికి పూర్తిస్థాయి మద్దతు లభిస్తుంది.
ఈ క్రమంలోనే ఎన్నో స్వచ్ఛంద సంస్థలు సరిహద్దుల్లో ఉద్యమం చేపడుతున్న రైతులందరికీ అండగా నిలిచి పలు రకాల సదుపాయాలను కల్పిస్తున్నాయి అన్న విషయం తెలిసిందే... కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులందరికీ చేయూత అందిస్తోంది అంతర్జాతీయ ఎన్జీవో ఖాల్సా. ఉద్యమం చేపడుతున్న రైతులకు నిత్యావసర వస్తువులు ఉచితంగా అందించేందుకు టిక్రి సమీపంలో కిసాన్ మాల్ ఏర్పాటుచేసింది. ఈ క్రమంలోనే ఆహారధాన్యాలు పేస్ట్ బ్రష్ లు చెప్పులు లాంటివి నిత్య అవసరాలను ఉచితంగా అందజేస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి