ఈ సమాజంలో ప్రజలకు వ్యతిరేకంగా జరిగే ఎన్నో చట్టాలు మరియు ఇతర పథకాలపై ప్రజలకు అండగా నిలబడే వారే కరువయ్యారు. కొంతమంది ప్రజలకు తాత్కాలికంగా సపోర్ట్ గా ఉన్నప్పటికీ, వారు రాజకీయ స్వార్ధం కోసమే చేస్తారే తప్ప ప్రజలపైన ప్రేమ వాళ్ళ కాదు. అలాగే ప్రభుత్వంలో పనిచేసిన అధికారులకు చట్టాల పట్ల మరియు పధకాల పట్ల మంచి అవగాహన ఉంటుంది. తద్వారా వారు ఏది ప్రజలకు ఉపయోగపడుతుంది అనే విషయాన్ని వెంటనే గ్రహించగలరు. అయితే ఇదంతా ఇలా ఉంటే, ఇదే ప్రభుత్వ అధికారులు తమ పదవులనుండి విరమణ పొందిన తరువాత ఎందుకు ఏమీ పట్టనట్లు ఉంటారు.. అంతేకాకుండా ప్రజల పక్షాన ఎందుకు నిలబడరు అనే విషయం ఇటీవల జరిగిన ఒక చటం విషయంలో తేటతెల్లమైంది.  

రీసెంటుగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మత మార్పిళ్ల నిరోధానికి ఒక చట్టాన్ని తీసుకువచ్చింది. అయితే దీనిలో ఏముందంటే పెళ్లి కోసం తమ మతాన్ని మార్చుకునే వీలును ఈ చట్టం కల్పించనుంది. అయితే ఇక్కడ ప్రజల నుండి వినిపిస్తున్న ప్రకారం పెళ్లి కోసం మతాన్ని మార్చుకోవడానికి ఎవరూ సిద్ద పడరు అంటున్నారు. అయితే ఎంతో మంది మేధావులు...గొప్పవాళ్ళు ఉన్నప్పటికీ ఈ విషయం మీద మాట్లాడడానికి వారెవరికీ నోరు రాదు. కాగా యోగి సర్కార్ తీసుకొచ్చిన ఈ ఆర్డినెన్సు ను వెనక్కు తీసుకోవాలని కొంతమంది మాత్రం లేఖ రాయడం గమనార్హం. ఇప్పుడున్న డిజిటల్ ప్రపంచంలో ముస్లిం మహిళా హక్కుల్ని కాలరాసే ట్రిపుల్ తలాక్ బిల్లుమీద మోదీ తీసుకున్న నిర్ణయంలో మద్దతు ఇవ్వాల్సిన నాయకులు మరియు మేధావులు అప్పుడు ఎక్కడికి పోయారో తెలీదు .

అంతేకాదు శబరిమలలో అయ్యప్ప స్వామి దర్శనానికి పరిమిత వయస్సు కలిగినవారు ప్రవేశానికి అనర్హులు.  ఇటువంటి ఆధ్యాత్మిక విషయాలలో నమ్మకం మరియు మనోబలాలు చాల ముఖ్యం...దీనిపై దూకుడుగా వ్యవహరించిన కేరళ ప్రభుత్వంపై ఎవరూ నోరు మెదపలేదు. అయితే ఇతర మతాల వారికి అంత ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వ అధికారులు హిందూ సంబంధిత విషయాలపై ఎందుకు స్పందించడం లేదో తెలియడం లేదు. తాజాగా యోగి సర్కారు తీసుకొచ్చిన మతమార్పిళ్ల నిరోధక ఆర్డినెన్సును వెనక్కి తీసుకోవాలని 104 మంది రిటైర్డు అధికారులు యూపీ సీఎంకు లేఖ రాశారు.  ఈ లేఖపై సంతకం చేసిన వారిలో నిరుపమారావు,  శివశంకర్ మీనన్ మరియు  వజాహత్ హబీబుల్లా పేర్లు ఉండడం ఆశ్చర్యపరిచే విషయం. మరి ఇక ముందైనా హిందూ ప్రజల విషయంలో రిటైర్డ్ అధికారులు స్పందిస్తారని ఆశిద్దాం...    

మరింత సమాచారం తెలుసుకోండి: