రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్గించిన రామతీర్ధం ఆలయ ఘటన పై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. సీఐడీ విచారణకు ఆదేశించింది. డిసెంబర్ 28 రాత్రి గుర్తు తెలియని దుండగులు రామతీర్ధం ఆలయంలోని రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటన జరిగిన తీరును చూస్తుంటే పక్కా ప్రణాళికతోనే విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు ఉందని డీజీ సునీల్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. విగ్రహం తలను ఆక్సా బ్లేడ్తో కోసినట్టుప్రాథమికంగా నిర్ధారించామన్నారు.
ఘటనాస్థలిలో ఓ రంపం కూడా దొరికిందని చెప్పారు. అంతేకాదు, ఈ ఘటనకు సంబంధించి అనేక ఆధారాలు సేకరించామని వెల్లడించారు. కేవలం విగ్రహాన్ని మాత్రమే ధ్వంసం చేశారనిగుడిలోని ఆభరణాలు, వస్తువులేవీ చోరీకి గురి కాలేదని డీజీ సునీల్ కుమార్చెప్పారు. దీన్ని బట్టి దేవాలయం గురించి బాగా తెలిసిన వ్యక్తులే ఈ పని చేసేందుకు అవకాశముందని అన్నారు. ... ఇదీ ఆకతాయిలు పని కాదని భావిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చేందుకు కొందరు ప్రయత్నించరాని తెలిపారు. సమాజంలో భిన్న వర్గాల మధ్య చిచ్చుపెట్టేందుకు ఘటనకు పాల్పడి ఉంటారని సునీల్ కుమార్ తెలిపారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి