ప్రస్తుతం భారత బ్యాంకింగ్ రంగంలో ఎక్కువ మంది కస్టమర్లను కలిగిన దిగ్గజ బ్యాంకు గా కొనసాగుతుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దేశీయ ప్రభుత్వరంగ అతిపెద్ద బ్యాంకు గా కొనసాగుతుంది.ఇక ఎప్పటికప్పుడు తమ సేవలను మెరుగు పరుచుకుంటూ తమ కస్టమర్లకు ఎంతో మెరుగైన సేవలను అందిస్తుంది దేశీయ అతిపెద్ద బ్యాంకింగ్ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంతేకాదు తమ కస్టమర్లకు  వివిధ రకాల లోన్స్ అందిస్తూ కూడా ఆర్థిక ఇబ్బందులు తీర్చేందుకు ఎప్పటికప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిద్ధంగా ఉంటుంది అనే విషయం తెలిసిందే. ఇక సొంతింటి కలను సాకారం చేసుకోవాలని భావించేవారికి ఇటీవలే ఒక అదిరిపోయే శుభ వార్త చెప్పింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.


 హోమ్ లోన్ తీసుకోవాలని భావించే వారి కోసం ప్రస్తుతం బంపరాఫర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న ఆఫర్ ద్వారా హోమ్ లోన్ తీసుకోవాలనుకునే వారికి భారీ ఊరట కలగనుంది.  ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోమ్ లోన్ తీసుకోవాలనుకునే వారికి  వడ్డీ రేట్లపై30 బేసిస్ పాయింట్ల వరకు రాయితీ అందిస్తోంది. అంతేకాకుండా ప్రాసెసింగ్ ఫీజును కూడా మాఫీ చేసేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. దీంతో హోమ్ లోన్ తీసుకునే వారికి ఈ ప్రయోజనాలతో ఎంతో లబ్ధి చేకూరుతుంది. ఈ క్రమంలోనే హోమ్ లోన్ తీసుకోవాలి   అనుకునే వారికి ఇదే మంచి సమయం అని చెబుతున్నారు నిపుణులు.


స్టేట్ బ్యాంక్‌లో రూ.30 లక్షల వరకు హోమ్ లోన్ తీసుకుంటే వడ్డీ రేటు 6.8 శాతంగా ఉంటుంది. రూ.30 లక్షలకు పైన హోమ్ లోన్ తీసుకుంటే 6.95 శాతం వడ్డీకే లోన్ వస్తుంది. అయితే ఇక్కడ మీ హోమ్ లోన్ వడ్డీ ట్లు సిబిల్ స్కోర్‌తో లింక్ అయ్యి ఉంటాయని ప్రతి ఒక్కరు గమనించాల్సి ఉంటుంది. రూ.5 కోట్ల వరకు హోమ్ లోన్స్‌కు 30 బేసిస్ పాయింట్ల తగ్గింపు లభిస్తుంది. 8 మెట్రో నగరాల్లో ఈ బెనిఫిట్ అందుబాటులో ఉంటుంది. మహిళలు హోమ్ లోన్ తీసుకుంటే 5 బేసిస్ పాయింట్లు తగ్గింపు లభిస్తుంది. అదే ఎస్‌బీఐ యోనో ద్వారా లోన్ పొందితే 5 బేసిస్ పాయింట్ల తగ్గింపు సొంతం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: