దాదాపు 50 వేల మంది సైనికులు ప్రస్తుతం లడక్ ప్రాంతంలో ఇలా మైనస్ డిగ్రీల చలిలో దేశం కోసం పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం లడక్ ప్రాంతంలో పహారా కాస్తున్న సైనికులు అందరికీ అన్ని ఏర్పాట్లు చేసేందుకు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతుంది. భారీగా నిధులు వెచ్చించి సైనికులు అందరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే అటు భారత్ మిత్ర దేశాలు కూడా క్లిష్ట సమయంలో ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ భారత్కు అండగా నిలుస్తున్నాయి అనే విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే ఇటీవలే భారత మిత్ర దేశమైన అమెరికా కూడా భారత్ కు అండగా నిలిచింది. ఇటీవల లడక్ ప్రాంతంలో గడ్డకట్టుకు పోయే చలిలో కూడా ఎక్కడా వెనకడుగు వేయకుండా దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధమయ్యి పహారా కాస్తున్న సైనికుల కోసం ఎక్స్ టెండెడ్ కోల్డ్ వెదర్ క్లాతింగ్ కిట్స్ ను అందించింది అమెరికా. ఇటీవలే భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ వీటిని పరిశీలించేందుకు వెళ్ళారు. విపరీతమైన అటువంటి మంచులో మనిషి బిగుసుకు పోయేది చలిలో.. లోపల సైనికులకు వేడిగా ఉండే విధంగా దుస్తులను అందించింది అమెరికా.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి