అయితే మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు తప్పనిసరిగా రోజూ కొంతసేపు నడకకు సమయం కేటాయించడం ఎంతో మేలు అని సూచిస్తున్నారు నిపుణులు. క్రమక్రమంగా వాకింగ్ సమయాన్ని పెంచుతూ పోవడం వల్ల మంచి ప్రయోజనం కనిపిస్తోందని అంటున్నారు. అంతేకాకుండా మోకాళ్ల నొప్పులతో బాధపడే వారు.. కాస్త ఉపశమనం కలగడానికి నీ గార్డులు, క్రేప్ బ్యాండేజ్ లు.. చిన్న బ్రేసెస్ లాంటి కొన్ని ఉపకరణాలను ఆర్థోపెడిక్ నిపుణుల సూచనల మేరకు వాడటం ఎంతో మేలు అంటున్నారు.
మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు కొన్ని రకాల పనులు చేయకపోవడం ఎంతో మేలు అని సూచిస్తున్నారు నిపుణులు. ఒక అంతస్తు కంటే ఎక్కువగా మెట్లెక్కి దిగడం లాంటివి అస్సలు చేయకూడదు. అంతేకాకుండా ఎగుడుదిగుడుగా ఉండే నేలపై నడవకూడదు.. వ్యాయామం సమయంలో కూడా సమతలంగా ఉండే నేలపై నడవడం ఎంతో ఉత్తమం. అంతేకాకుండా నేలపై 2 కాళ్లు మడత వేసుకొని కూర్చోవడం లాంటివి చేయకండి. అంతేకాదు బరువైన వస్తువులు కూడా ఎత్తకపోవడం ఎంతో మంచిది. ఇలా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఉపశమనం ఉంటుంది అని సూచిస్తున్నారు నిపుణులు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి