తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రజలందరిలో ఉన్న అనుమానాలు అన్నింటిని పటాపంచలు చేసేందుకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మొదటి వ్యాక్సిన్  తీసుకుని అందరిలో నమ్మకాన్ని కలిగించాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మొదట కరోనా  వారియర్స్ కు  వ్యాక్సిన్ అందించేందుకు సిద్ధమయింది తెలంగాణ ప్రభుత్వం.  అయితే వాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయినప్పటికీ కూడా ఇప్పటికి ఎంతో మంది ప్రజలలో  వ్యాక్సిన్ వేసుకోవటం మంచిదేనా ఏమైనా సైడ్ఎఫెక్ట్స్ ఉన్నాయా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.


 ఇలాంటి అనుమానాల నేపథ్యంలో ఇటీవల రాష్ట్ర ప్రజారోగ్య విభాగం సంచాలకులు శ్రీనివాసరావు పలు కీలక విషయాలను వెల్లడించారు.  వ్యాక్సిన్  100% సురక్షితమని ప్రజలందరూ ఎలాంటి భయం లేకుండా టీక వేసుకోవచ్చు అంటూ పేర్కొన్నారు. టీక వేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరిలో జ్వరం కండరాల నొప్పి దురదలు లాంటి లక్షణాలు కనిపిస్తాయని.. ప్రజలు ఇక వేసుకున్న తర్వాత ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటూ భరోసా ఇచ్చారు. అంతేకాదు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న తప్పుడు వార్తలను నమ్మి వ్యాక్సిన్  సామర్థ్యంపై అపోహలు అనుమానాలు పెంచుకోవద్దు అంటూ విజ్ఞప్తి చేశారు.



 కొంతమందికి టీకా వేసిన తర్వాత తీవ్రంగా జ్వరం వస్తుందని.. దీన్ని అర్థం వ్యాక్సిన్  కు శరీరం ఎంతో సమర్థవంతంగా స్పందిస్తుంది అని అర్థం చేసుకోవాలి అంటూ సూచించారు. అంతే కానీ జ్వరం రావడాన్ని సైడ్ఎఫెక్ట్స్ అని మాత్రం అనుకోవద్దు అంటూ తెలిపారు.  ఇక టీకా వేసుకున్న ప్రతి ఒక్కరిలో కూడా జ్వరం కండరాల నొప్పి దురద లాంటి లక్షణాలు అత్యంత సాధారణమైనవి  అని అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఇలాంటి లక్షణాలు కేవలం రెండు రోజుల వ్యవధిలో ప్రతి ఒక్కరిలో వాటంతట అవే తగ్గిపోతాయి.. ఇక రెండో డోస్  వేసుకున్న తర్వాత కాస్త ఎక్కువ రియాక్షన్లు ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు.



తెలంగాణలో రెండు రకాల వ్యాక్సిన్లు  అందిస్తున్నారు. అందులో కోవిషీల్డ్ ఒకటి. ఈ టీకా వేసిన ప్రదేశంలో నొప్పి, చర్మం సున్నితంగా మారటం, తలనొప్పి, అలసట, కండరాల నొప్పి, అన్ ఈజీగా అనిపించటం, జ్వరం, చలి, కీళ్ల నొప్పులు, కడుపులో వికారంలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక కోవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో టీకా వేసిన ప్రదేశంలో నొప్పి, చర్మం సున్నితంగా, అదేవిధంగా తలనొప్పి, అలసట, కండరాల నొప్పి, జ్వరం, కీళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులు, కడుపులో వికారం, వాంతులు ఉంటాయి. కొందరిలో చమట పట్టడం, జలుబు, దగ్గు, చికాకు, వణుకు వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: