నార్వే: ప్రపంచం మొత్తాన్ని కరోనా మహమ్మారి వణికిస్తూనే ఉంది. ఏడాది నుంచి ప్రజలు వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే అనేక దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలై లక్షలాది మంది వ్యాక్సిన్ డోస్ కూడా తీసేసుకున్నారు. మరికొన్ని దేశాల్లో ఇప్పుడిప్పుడే వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైంది. తాజాగా నార్వేలో జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్, అమెరికాకు చెందిన ఫైజర్ సంయుక్తంగా తయారు చేసిన వ్యాక్సిన్‌కు అత్యవసర వినియోగ అధికారానికి అనుమతులు లభించాయి. ఐరోపా దేశంగా ఉన్న నార్వేలో ఈ వ్యాక్సిన్ ప్రక్రియ మొదలైంది. అయితే ఈ వ్యాక్సిన్ తీసుకున్న కొద్ది సేపటికే 23 మంది మృతి చెందడం వైరల్ అయిపోయింది.

ఈ విషయాన్ని నార్వేలోని ఆరోగ్య శాఖ అధికారులు నిర్థారించారు. 23 మంది మరణించడం వల్ల నార్వే దేశ ప్రజల్లో ఆందోళన నెలకొంది. మరణించిన వారంతా వయసు పైబడిన వారేనని అధికారులు పేర్కొన్నారు. దీంతో వయసు పైబడిన వారికి, అనారోగ్యంతో ఉన్న వారికి వ్యాక్సిన్ ఇవ్వడం అంత శ్రేయస్కరం కాదంటూ నార్వే తాజాగా హెచ్చరించింది. కాగా.. వ్యాక్సిన్ తీసుకుని మరణించిన వారు.. ఏ విధంగా ప్రాణాలు కోల్పోయారనే దానిపై విచారణ జరుపుతున్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే 13 మంది పోస్ట్ మార్టం రిపోర్ట్‌లు వచ్చినట్టు చెప్పారు. వారందరిలో ఒకే రకమైన దుష్ప్రభావాలు వారి ఆరోగ్య స్థితిని బలహీరపరిచినట్టు తాము తెలుసుకున్నామని నార్వేజియన్ మెడిసిన్స్ ఏజెన్సీ చెప్పుకొచ్చింది.

కాగా.. భారత్‌లోనూ నేటి నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 3 వేలకు పైగా కేంద్రాల్లో ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇచ్చారు. మొదటి రోజు దాదాపు రెండు లక్షల మంది వ్యాక్సిన్ డోస్ తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారెవరిలో అనారోగ్యం తలెత్తినట్టు రిపోర్ట్ రాలేదని అధికారులు చెప్పారు. ప్రస్తుతం 3 కోట్ల మందికి ఇచ్చేందుకు వ్యాక్సిన్లు రెడీగా ఉన్నాయని.. తర్వలోనే 30 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చే సామర్థ్యం భారత్‌కు ఉన్నట్టు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: