ప్రస్తుతం మనకు కావాల్సిన ప్రతీ వస్తువు కూడా మార్కెట్లో దొరుకుతుంది అన్న విషయం తెలిసిందే.  ఇక మనకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేయడం లేదా కావాల్సినన్ని రోజులు కేవలం వాడుకోవడానికి అద్దెకు తీసుకోవడం లాంటివి చూస్తూ ఉంటాం.  కానీ ఈ మధ్య కాలంలో ప్రేమ అనేది సంతలో దొరికే ఒక వస్తువుగా మారిపోయింది. ఏకంగా ప్రేమించే ప్రియురాలు అద్దెకు వస్తుంది ఈ రోజుల్లో. ఆన్లైన్ ప్రపంచంలో ఇలాంటివి కొన్నిసార్లు ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. అయితే సాధారణంగా ప్రేమ అన్న తర్వాత ప్రేమికులు  సరసాలు ఆడుకోవడం సర్వసాధారణం.



 ఒకవేళ ప్రేమికుల మధ్య ఎలాంటి సరసాలు లేవు అంటే అది అసలు ప్రేమే కాదు అంటారు అందరు. అయితే నిజంగా ప్రేమించిన ప్రియురాలితో సరసాలు ఆడటం తప్పుకాదు కానీ.. అద్దెకు తీసుకున్న ప్రియురాలితో మాత్రం అవన్నీ కుదరవు. ఇక్కడ ఒక దేశంలో ప్రియురాలిని అద్దెకు తీసుకోవచ్చు కానీ కొన్ని నిబంధనలు మాత్రం ఉంటాయి.  వాటిని అధిగమిస్తే మాత్రం భారీ జరిమానా తప్పదు. ఇటీవలే ఓ యువకుడికి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది.  తైవన్ యూనివర్సిటీ లో చదువుతున్న చెన్  అనే యువకుడు.. ఓ సంస్థ వద్ద యువతిని ప్రియురాలిగా  అద్దెకు తీసుకున్నాడు. మూడు గంటల పాటు సదరు యువతి అతనికి ప్రియురాలిగా  ఉండాలి.



 ఇక రూల్ ప్రకారం అయితే ఆ యువకుడు తన ప్రియురాల్ని చేయి పట్టుకోవచ్చు,  కౌగిలించుకోవచ్చు  కూడా. కానీ ముద్దు పెట్టుకోవడానికి శరీరంపై ఎక్కడ పడితే అక్కడ చేతులు వేయడానికి మాత్రం అస్సలు రూల్స్ అంగీకరించవు. ఇక ఈ నిబంధనలు అన్నింటికీ అంగీకరించిన యువకుడు ఇటీవలే తన ప్రేయసి ఒక రెస్టారెంట్ కి తీసుకెళ్లాడు.  అంతలో అతనికి పాడుబుద్ధి మొదలైంది. ఆమెతో అసభ్యకరంగా మాట్లాడడం మొదలుపెట్టాడు.  నేను నిన్ను కిడ్నాప్ చేస్తా అంటూ బెదిరించి శరీరాన్ని తాకడం మొదలుపెట్టాడు.  ఇక తాకరాని చోట తాకాదు.. ఆమె పిదురులు, తొడలు  కూడా తాకాడు.  ఇక ఆ తర్వాత సదరు యువతి నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి యువకుడిపై ఫిర్యాదు చేయడంతో చివరికి..  భారీ జరిమానా కట్టాడు యువకుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: