ప్రస్తుతం డిజిటల్ పేమెంట్ ప్లాట్ ఫామ్స్  హవా అంతకంతకూ పెరిగిపోతోంది అన్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు డిజిటల్ పేమెంట్ ప్లాట్ ఫామ్ తమ కస్టమర్లను ఆకర్షించే విధంగా ఎంతో అద్భుతమైన ఆకర్షనీయమైన ఆఫర్లతో తెర మీదకు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అయితే ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ ప్లాట్ ఫామ్ అయినా పేటీఎం సరికొత్త ఆఫర్ లను తమ కస్టమర్లకు అందుబాటులోకి తీసుకు వస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇటీవలే మరో కీలక నిర్ణయం తీసుకున్న పేటీఎం తమ కస్టమర్లకు శుభవార్త చెప్పింది.



 ప్రస్తుతం చేతిలో ఉన్న డబ్బులు ఎక్కడైనా దాచుకోవాలి అనే ఆలోచనలో ఉన్న వారికి శుభవార్త చెప్పింది  పేటీఎం. మరో బ్యాంకు తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఇటీవలే అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలోనే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్స్  అందరికీ ఎంతగానో ప్రయోజనం చేకూరనుంది. సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు తో ఇటీవల జతకట్టింది పేటీఎం.  ఇక తద్వారా పేటియం కస్టమర్స్  అందరికీ ఇక రానున్న రోజుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ సేవలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు నిర్ణయించింది. అయితే పేటీఎం పేమెంట్స్ ఇప్పటికే ఇండస్ఇండ్ బ్యాంకు తో జతకట్టి తమ కస్టమర్లకు ఫిక్స్డ్ డిపాజిట్ సేవలు అందిస్తుంది అన్న విషయం తెలిసిందే.



 ఇక ఇప్పుడు మరో బ్యాంకు తో జత కట్టి  మల్టిపుల్ ఫిక్స్డ్ డిపాజిట్ సర్వీసులను అందించేందుకు నిర్ణయించింది పేటీఎం. అయితే దేశంలో ఇలా మల్టిపుల్ పార్ట్నర్ ఫిక్స్డ్ డిపాజిట్ సర్వీసులను అందిస్తున్న తొలి డిజిటల్ పేమెంట్ ప్లాట్ ఫామ్ గా పేటీఎం రికార్డు సృష్టించింది అనే చెప్పాలి.  కాగా కస్టమర్లు ఎఫ్‌డీలను పోల్చి చూసుకోవచ్చు. కనీసం ఎంత ఇన్వెస్ట్ చేయాలి? వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి? టెన్యూర్? వంటి పలు అంశాలను పోల్చి చూసుకొని నచ్చిన బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. పేటీఎం ద్వారా ఈ రెండు బ్యాంకుల్లో ఎఫ్‌డీ చేస్తే జీరో పెనాల్టీ చార్జీల బెనిఫిట్ పొందొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: