సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా తమ డబ్బులను భద్రంగా దాచుకోవడానికి ఎక్కువగా బ్యాంకులను ఆశ్రయిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇంట్లో బీరువాలో దాచుకున్నా చీడపురుగుల బారిన పడే అవకాశం ఉందని లేదా దొంగలు పడితే పూర్తిగా దోచుకుపోయే అవకాశం ఉందని భయపడే ఎంతో మంది జనాలు బ్యాంకులో వారి డబ్బును దాచుకుంటూ ఉంటారు. బ్యాంకు లాకర్లలో తమ డబ్బు ఎంతో సురక్షితంగా ఉంటుంది అని నమ్ముతూ ఉంటారు అందరు. ఇక అటు బ్యాంకు సిబ్బంది కూడా తమ బ్యాంకులో కస్టమర్లు డిపాజిట్ చేసిన డబ్బులు ఎంతో భద్రంగా దాచి డానికి ప్రయత్నిస్తూ ఉంటారు.



 ఇలా నగదును భద్రంగా దాచడానికి  ప్రత్యేకంగా లాకర్లు కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ జరిగిన ఘటన గురించి తెలిస్తే మాత్రం ఎవరు కూడా మరోసారి బ్యాంకు లాకర్లో డబ్బులు దాచి పెట్టాలి అంటే వెనకడుగు వెయ్యక మానరు. సాధారణంగా బ్యాంకు లాకర్ లో డబ్బులకు పూర్తి భద్రత ఉంటుందని అందరూ డబ్బులు జమ చేస్తూ ఉంటారు. కానీ బ్యాంకు లాకర్లో కూడా డబ్బులకు ఎలాంటి భద్రత ఉండదని ఇక్కడ జరిగిన ఘటన చూస్తే అర్థమవుతుంది.  ఏదో దొంగలు పడి పూర్తిగా పట్టుకు పోయినట్టున్నారు అని అనుకుంటే మాత్రం పొరబాటే.. దొంగలు పడలేదు కానీ డబ్బు దేనికీ పనికి రాకుండా పోయింది.



 దీనికి కారణం చెదలు.  దాచి దాచి  దయ్యాల పాలు చేస్తున్నారు అనే సామెత ఇక్కడ జరిగిన ఘటనకు సరిగ్గా సరిపోయింది. గుజరాత్లో ఓ బ్యాంకులో లాకర్లో దాచుకున్న లక్షల డబ్బు చెదల పాలు చేశారు సిబ్బంది. విషయం తెలిసిన బాధితుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. బ్యాంకు సిబ్బంది తన డబ్బును తిరిగి చెల్లించాలి  అంటూ డిమాండ్ చేశాడు. బాధితుడు వడోదర బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో 2.2 లక్షల నగదును దాచుకున్నాడు. ఇటీవలే లాకర్ తెరిచి చూడగా ఆ డబ్బుల కట్టలకు పట్టిన చెదలు పూర్తిగా నోట్ల కట్టలను తినేసాయి దీంతో బాధితుడు లబోదిబో మన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: