రాష్టం రాజకీయాల్లో మరో కలయిక దాదాపు ఖాయమైంది. ఇప్పటికే ప్రజారాజ్యం కాంగ్రేస్ లో కలసింది. అయితే ఈసారి జరగబోయే కలయిక ఆ విధంగా ఉంటుందా, కాస్తా డిఫరెంట్ గా ఉంటుందా అనే దానిపైనే సందిగ్దం నెలకొంది. ఈనెలాఖరులోగా అదేంటో తేలనుందని సమాచారం.
అయితే అది గంపగుత్తగా ఓపార్టీ కలుస్తుందా...లేక కాస్తా రివర్స్ లో అటునుంచే ఇటో ముక్క కలుస్తుందా అన్నదానిపైనే తెగ మేథోమథనం జరుగుతోంది. అందుకే కేసిఆర్ కేకే తెగ ముచ్చట్లు పెట్టారు. అందరు అనుకుంటున్నది కాంగ్రేస్ లో తెరాస కలుస్తుందని. పుకార్లే కాదు, తెలంగాణ ఇస్తే కలుస్తా అని కేసిఆర్ ఇప్పటికీ చెబుతున్నారు. అయితే ఆ ఆశలు గల్లంతయినట్టేనని ఇటీవలి కేంద్రమంత్రివర్గ విస్తరణ తేల్చేసింది. తెలంగాణ అని గలమెత్తిన వారి గుండుపై బండతో బాదింది. తెలంగాణ ఊసెత్తని వారిని అందలం ఎక్కించింది. ఇటు టి మంత్రులను ఆమాటెత్తకుండా చేసింది. అంతే కాదు తెలంగాణ కాంగ్రేస్ ను రెండుగా చీల్చేసింది ఆపార్టీ కేంద్రనాయకత్వం. ఇప్పుడు తెలంగాణ కాంగ్రేస్ లో తెలంగాణ కోసం ఉద్యమించేవారిదో ముక్క, ఆజోలి వెల్లని వారిదో ముక్కగా విడిపోయింది.
దీంతో గులాభినేత పెద్దలతో చెడి, కనీసం చిన్నలతోనైనా కలిసి కొంత ఉపశమనం పొందాలని పథకం వేసారు. తెలంగాణ తెస్తారా...నేనే మీలో కలుస్తా. లేదంటే తెలంగాణ ఇవ్వని పార్టీలో ఉండడం కంటే మాలో కలసిపోండి, ఏకమవుదాం అన్న ప్రతిపాదన పెట్టారట. నిజానికి తెలంగాణ వాదం భుజానవేసుకున్న ఎనిమిది మంది ఎంపీలతో పాటు కొందరు సీనియర్లు కూడా కాంగ్రేస్ లో ఉన్నారు. వారి పరిస్థితి కూడా‘ ఘర్ కా నా ఘాట్ కా ’ అన్నట్లు తయారైంది. సొంత ప్రభుత్వమే అరెస్టు చేసే, వద్దనాల్సిన తల్లి ఆపని చేయకుండా మంత్రివర్గంలో మొండి చేయి చూపించి మరో మొట్టికాయ వేసింది. అందుకే పార్టీలో ఉంటేనే రాజకీయంగా నష్టం అన్న భావనలో వారంతా ఉన్నారని సమాచారం.
ఇలాంటి సమయంలో ఒక్కసారిగా ఎనిమిది మంది ఎంపీలు, కొందరు సీనియర్లు వెల్లిపోతే రాజకీయ భవిష్యత్తు కోసం అటు ఇటు కాకుండా ఉన్న వారు కూడా కంగుతినక తప్పదు. వారు తెలంగాణ వ్యతిరేకులని అప్పుడు ఖచ్చితంగా ముద్రపడుతుంది. ఇప్పటి పదవులేమో కాని ఇక రాజకీయాలకే దూరమయ్యే పరిస్థితి వస్తుందన్న భయం వారికి పట్టుకోవడం ఖాయం. అలాంటప్పుడు కాంగ్రేస్ కు గడ్డుపరిస్థితి తలెత్తుతుంది. అందుకే అనుకూల నిర్ణయం తీసుకొని టిఆర్ఎస్ ను కలుపుకొని ముందుకు పోవడమా...లేక ఇలాంటి పరిస్థితిని తెచ్చుకోవడమా... అని కూడా అధిష్టానం ఆలోచిస్తోందట. కాని టిఎంపీలు తదితరులు టిఆర్ఎస్ లోకి వెల్లరు అన్న ధీమా అధిష్టానానికున్నప్పటికి, చేరకుండా వేరు కుంపటి పెట్టినా నష్టమే. ఈభయాన్ని అధిష్టానానికి మరింత ఎక్కువ చేసి మచ్చిక చేసుకోవాలన్నదే గులాబి నేత ప్లాన్ అట. సరే ఏదో ఒకటి జరగడం మాత్రం ఖాయమనే సంకేతాలే ఎక్కువ వస్తున్నాయి.
మరింత సమాచారం తెలుసుకోండి: