బెల్లం లో ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి లాంటివి ఉంటాయి. కాబట్టి ఇక నీటిలో వేడి చేయడం వల్ల మరింత మెరుగైన ఫలితం కనిపిస్తుందట. వెచ్చని బెల్లం పానకం తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని సూచిస్తున్నారు నిపుణులు. సాధారణంగా చలికాలం అంటే రోగాల సీజన్ అని అంటూ ఉంటారు. వాతావరణంలో తరచూ మార్పులు చోటు చేసుకుంటాయి కాబట్టి అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే చలికాలంలో బెల్లం పానకం లాంటి తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. రోగ నిరోధక శక్తి పెరగడం వల్ల వివిధ రకాల సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు అవకాశం ఉండదు.
అంతేకాదు ఇక బెల్లం పానకం తీసుకోవడం వల్ల ఒత్తిడి కూడా తగ్గిపోతుందట. గోరువెచ్చని బెల్లం పానకం వల్ల ఉదయం వేళల్లో మలవిసర్జన ఎంతోసౌకర్యవంతంగా ఉండడంతో పాటు కడుపులోని విషతుల్యాలను కూడా బయటకు పంపుతుందట. జీర్ణ ప్రక్రియ కూడా ఎంతో మెరుగు పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు ఇక చలికాలంలో శరీరాన్ని ఎంతో వెచ్చగా ఉంచటం లో కూడా బెల్లం ఉపయోగ పడుతుందని చెబుతున్నారు. ఇక జ్వరంతో బాధపడే వారికి జ్వరం నుంచి కోలుకోవడానికి బెల్లం పానకం ఎనర్జీ డ్రింక్ లాగా పనిచేస్తుంది అని సూచిస్తున్నారు. అంతేకాదు బరువు తగ్గేందుకు కూడా ఆస్కారం ఉంటుందట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి