అయితే తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం డిగ్రీ, ఇంటర్మీడియట్ విద్యా సంస్థల ను తెరిచి అటు విద్యార్థులందరికీ విద్యా బోధన ప్రారంభించేందుకు ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే గతం లో డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ ను కూడా మొదలు పెట్టింది దోస్త్ వెబ్ సైట్. డిగ్రీ విద్యార్థులు అందరూ కూడా దరఖాస్తు చేసుకోవాలి అంటూ సూచించింది. ఇక దరఖాస్తు చేసుకున్న వారికి ఆప్షన్లను కూడా ఎంపిక చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఎంతో మంది విద్యార్థులు ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నారు.
అయితే గతం లో వివిధ కారణాల దృష్ట్యా కొంత మంది విద్యార్థులు ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోక పోవడం ఆప్షన్లను ఎంపిక చేసుకోక పోవడం జరిగింది అన్న విషయం తెలిసిందే. ఇలాంటి విద్యార్థులకు మరో సారి అవకాశం కల్పిస్తూ ప్రైవేటు, ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలో ప్రవేశాల భర్తకి ఉన్నత విద్యా మండలి ప్రత్యేక స్పాట్ కౌన్సిలింగ్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. ఫిబ్రవరి 1, 2 తేదీల్లో స్పాట్ అడ్మిషన్స్ జరుగుతాయని దోస్త్ కన్వీనర్ లింబాద్రి తెలిపారు. ఇప్పటివరకు దరఖాస్తులు చేసుకోని వారు, రిజిస్టర్ అయ్యి ఆప్షన్లు పొందనివారు స్పాట్ అడ్మిషన్ ప్రక్రియ లో పాల్గొనాలి అంటూ ఆయన సూచించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి