ఇందులో ఉత్సవాలకు సంబంధించిన పలు ప్రధాన అంశాలను చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రధసప్తమి నాడు దర్శనం టోకెన్లు కలిగిన భక్తులను వాహన సేవల దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. కానీ కరోనా నిబంధనలు మాత్రం ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ప్రతి భక్తునికి ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో..చక్ర స్నానాన్ని మాత్రం ఏకాంతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతున్న క్రమంలో.. భక్తుల సంఖ్యను పెంచేందుకు యోచిస్తున్నట్లు తెలిపారు. కానీ ఇప్పుడప్పుడే గతంలో ఉన్నంత భక్తుల రద్దీకి అవకాశం లేదని పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులను అనుమతించనున్నట్లు పేర్కొన్నారు.
శాసన రాజధాని అయిన అమరావతి పరిపాలన రాజధాని అయిన విశాఖలో ఆలయాల నిర్మాణం పూర్తి అవుతుందని ఏప్రిల్ లో ఆలయాలను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు సుబ్బారెడ్డి. ఇక మరో ముఖ్య విషయం ఏంటంటే..!! ఈ నెల 13వ తేదీన చెన్నైలోని టీనగర్ లో పద్మావతి అమ్మవారి ఆలయానికి శంకు స్థాపన చేయబోతున్నట్లు శుభవార్త ను అందించారు. మరి ఈ సువర్ణ అవకాశాన్ని భక్తులంతా ఉపయోగించుకోవాలని ఆశిద్దాం. మరో వైపు జన సందోహం ఎక్కువగా ఉండమన్న కారణంగా కరోనాకు సంబంధించి అన్ని జాగ్రత్త పరమైన చర్యలను మరియు తిరుమల మాడ వీధుల్లో భద్రతను పటిష్టం చేయనున్నట్లు తెలిసింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి