ఈ క్రమంలోనే ఆటగాళ్లందరూ కూడా తప్పనిసరిగా బయో బబుల్ పద్ధతిలో క్వారంటైన్ లో ఉంటూ వరుసగా మ్యాచ్ లు ఆడుతున్నారు అనే విషయం తెలుస్తుంది. ఇక మొన్నటికి మొన్న అయితే ఆస్ట్రేలియా పర్యటన సమయంలో కనీసం కుటుంబంతో కూడా కలసి ఉండటానికి వీలు లేకుండా పోయింది. ఇక ఇటీవల స్వదేశానికి చేరుకున్న భారత జట్టు కుటుంబంతో కలిసి క్వారంటైన్ లో ఉంటూ.. మ్యాచ్ లు ఆడేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే వరుసగా క్వారంటైన్ లో ఉంటూ ఉండడంతో ఆటగాళ్లు ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉందని మాజీ క్రికెటర్లు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల టీమిండియా హెడ్ కోచ్ కూడా ఇదే అంశాన్ని లేవనెత్తారు.
వరుసగా క్రికెట్ మ్యాచ్ లు ఆడటానికి ఆటగాళ్లు బయో బబుల్ సెక్యూర్ పద్ధతిలో క్వారంటైన్ లో ఉంటూ ఆడుతూ ఉండటం వల్ల ఆటగాళ్లు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు అంటూ రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి భారత ప్లేయర్లందరికీ కొంత విరామం అవసరం అంటూ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ దగ్గర నుంచి ఇంగ్లాండ్ తో ఆడుతున్న సిరీస్ వరకు ఆటగాళ్లు బయో సెక్యూర్ బబుల్ పద్ధతిలో మ్యాచ్లు ఆడుతున్నారని వాళ్ళు కూడా మనుషులే కాబట్టి ఇక ఇంగ్లాండ్తో సిరీస్లు ఐపీఎల్ ముగిసిన తర్వాత వారికి కొంత కాలం పాటు విశ్రాంతి ఇవ్వాలి అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ తర్వాత వారు మరింత ఉత్సాహంగా ఆడేందుకు అవకాశం ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి