ఒంటరితనం కొన్ని సార్లు మంచి చేస్తే.. మరికొన్ని సార్లు చెడుని కలిగిస్తుంది. ఇక ఆధునిక జీవన విధానంలో ప్రతి ఒక్కరూ రేసులో గెలిచేందుకు పరుగులు తీస్తుంటారు. ఫర్ ఏ చేంజ్.. కొంత సమయం ఏ పని- పాట లేకుండా ఖాళీగా కూర్చోండి. ఖాళీగా కూర్చోవడం అంటే ఉద్యోగం చేయకుండా ఇంట్లోనే ఉంటూ.. ఇంటి పని, వంట పని చేయడం, టీవీ చూడటం, లేదా ఫోన్లో చాటింగ్, గేమ్ ఆడటం లాంటివి చేసుకుంటూ కాలం వెల్లదీయడం కాదు. అలా అని నిద్రపోయేరు సుమీ.. ఇవేవీ చేయకుండా ప్రశాంతంగా, ఖాళీ ఖాళీగా హాయిగా కూర్చోవడం అన్నమాట. నిజానికి ఖాళీగా ఉండటం కూడా ఓ వరం లాంటిది అంటున్నారు నిపుణులు. ఎందుకంటే మన శరీరానికి, మనసుకు కొన్ని సార్లు విరామం తప్పనిసరి అట. ఎందుకో ఓ సారి తెలుసుకుందామా.

ఇక నిజానికి ఒంటరిగా ఉండి ఆలోచించడానికి చాలా ధైర్యం కావాలి. తరచుగా మన ఫోన్‌లను స్క్రోల్ చేయడం, సినామాలు చూడటం ద్వారా మనల్ని మరల్చడానికి ప్రయత్నిస్తుంటాము. కానీ మీరు మీ ఆలోచనలతో ఒంటరిగా గడపటం ద్వారా.. మీ మనసు స్వతంత్రంగా, మానసికంగా బలంగా ఉండటానికి సహాయపడుతుంది.  

ఇక పని లేకుండా ఉన్నప్పుడు, ప్రతి క్షణం ఆస్వాదించడానికి వీలుంటుంది. ఎలాంటి ఖర్చు చేయకుండా మీరు సంతోషకరమైన సన్నివేశాలు గుర్తుచేసుకుని ఆనందం పొందవచ్చును. అంతేకాదు ఒంటిరిగా ఉండటం వల్ల మీ ఆలోచనలను మీరు గమనించి, వాటిని పరిష్కరించుకోగలుగుతారు. మీ గురించి బాగా తెలుసుకుని మీతో మీరే ఓ సంబంధాన్ని పెంచుకుంటారు. ఫలితంగా భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడంతో పాటు.. భావాలను తెలుసుకుంటారు.

అయితే ఏమీ చేయకూడదని, ఒక విషయంపై మాత్రమే దృష్టి పెట్టాలని మీరు మీ మనసుకు శిక్షణ ఇచ్చినప్పుడు, మీరు దృష్టి మరల్చకుండా ఉండటానికి సిద్ధమవుతారు. తద్వారా మీ ఏకాగ్రత సామర్థ్యం మెరుగవుతుంది. ఇక మీ ఆలోచనలు, భావోద్వేగాలపై దృష్టి సారించేటప్పుడు మీరు చాలా స్పష్టమైన ఆలోచనలు చేయగలుగుతారు. మీలో సృజనాత్మకత వ్యక్తీకరించడానికి ఇది మీకు సహాయపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: