అయినప్పటికీ పలువురు... కోవిడ్-19 వ్యాక్సిన్‌పై ఉన్న అనుమానాలు , సందేహాలతో వ్యాక్సినేషన్ తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. కరోనా మహమ్మారి తీవ్రత నేపథ్యంలో వ్యాక్సిన్ అభివృద్ధి కాస్త వేగంగా జరిగిన విషయం తెలిసిందే. మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలయ్యాక... వ్యాక్సిన్ తీసుకున్న కొందరు వ్యక్తులకు రియాక్షన్ వచ్చిందంటూ వార్తలు వినిపించాయి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వ్యాక్సిన్ తీసుకున్న కొంతమంది అంగన్వాడీ వర్కర్లు, హెల్త్ కేర్ వర్కర్లలో దుష్ప్రభావాలు కనిపించాయని వార్తలు వచ్చాయి. తద్వారా వ్యాక్సిన్ పై కొందరికి అభద్రతా భావం ఏర్పడింది.
దీంతో పలువురు హెల్త్ వర్కర్లు వ్యాక్సిన్ తీసుకొనేందుకు నిరాకరిస్తున్నారు.ఈ నేపథ్యంలో ఒడిశాలోని కటక్ జిల్లా కలెక్టర్ జారీ చేసిన తాజా నిర్ణయం సంచలనంగా మారింది. వ్యాక్సిన్ తీసుకోకపోతే మీ జీతాలు కట్ అంటున్నారు ఆ కలెక్టర్. రిజిస్ట్రేషన్ అయిన తరువాత కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రాని హెల్త్ కేర్ వర్కర్లకు, ఫిబ్రవరి 10 వరకు సమయం ఇస్తున్నామని... ఆలోగా వ్యాక్సిన్ తీసుకోని అంగన్వాడీ వర్కర్లకు జీతాలు నిలిపివేస్తామని, ఇచ్చేది లేదని ఆయన హెచ్చరించారు. వ్యాక్సినేషన్ విషయంపై ఆయన చేసిన తాజా హెచ్చరిక పెద్ద చర్చకు దారి తీసింది.
రాష్ట్రంలోనే కటక్ జిల్లాలో వ్యాక్సినేషన్ శాతం అత్యల్పంగా నమోదైందని, ప్రజల్లో వ్యాక్సిన్ పట్ల నమ్మకం పోతోందని..ఇది ఒక విధంగా జిల్లాకు అవమానకరమైన పరిస్థితి తేవడమేనని కటక్ కలెక్టర్ చాయని... కటక్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. భారత్‌లో ఇస్తున్న కోవిషీల్డ్, కోవ్యాక్సిన్లు రెండూ సురక్షితమైనవేనని, కొందరికి సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చని... ఒకవేళ వస్తే అంతగా భయపడాల్సిన అవసరం లేదని. చిన్న చికిత్సతో బాగా అయిపోతుందని చెబుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి