కాగజ్నగర్ లో ఏర్పాటు చేసిన
ఛత్రపతి శివాజీ సంకల్ప సభకు
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్
తరుణ్ చుగ్ హాజరయ్యారు . కాగజ్నగర్ కు వెళ్లే మార్గ మద్యమంలో శ్రీరాంపూర్ వద్ద
తరుణ్ చుగ్ కార్మికులు,
బీజేపీ కార్యకర్తల సమక్షంలో
తరుణ్ చుగ్ మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ
కవిత టార్గెట్ గా విమర్శలు కురిపించారు.
తరుణ్ చుగ్ మాట్లాడుతూ..ఎమ్మెల్సీ
కవిత,
కేసీఆర్ సింగరేణి లో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. కోట్ల రూపాయల ఆదాయం వచ్చే సింగరేణిని
కేసీఆర్ కుటుంబం దోచుకుందని అన్నారు. సింగరేణిలో పెత్తనం చలయిస్తూ అధికారులను చెప్పు చేతుల్లో పెట్టుకున్నారని ఆరోపించారు.
కవిత సింగరేణిలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని... .ఆమెపై
సీబీఐ విచారణ జరిపించాలని అన్నారు.
కవిత సింగరేణికి యూనియన్
లీడర్ గా మారిందని ఆరోపించారు.
అనంతరం బండి సంజయ్ తో కలిసి కాగజ్నగర్ లో సభకు హాజరయ్యారు. ఈ సభలో సిర్పూర్
కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ పాల్వాయి హరీష్ బాబు
కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి
బీజేపీ కండువా కప్పుకున్నారు. బండి సంజయ్ హరీష్ బాబు కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సభలో పాల్వాయి అభిమానులు కార్యకర్తలు కూడా పార్టీలో చేరారు. అంతే కాకుండా ఈ సభకు పాల్వాయి అభిమానులు భారీగా హాజరయ్యారు. ఇక సభలో బండి సంజయ్ మాట్లాడుతూ..అమరవీరుల రక్తపు మడుగులో టిఆర్ఎస్ పాలన సాగుతోందని అన్నారు .
బీజేపీ ఏ మతానికి అతీతం కాదని 80 శాతం ఉన్న హిందువుల కోసం కొట్లాడుతుందని వివరించారు.
హైదరాబాద్ ను యూటీ చేస్తారని తప్పుడు ప్రచారం జరుగుతోందని అన్నారు. 2023 లో తెలంగాణలో రామ రాజ్యం సృష్టిస్తామని
కేసీఆర్ ను జైలుకు పంపిస్తామని అన్నారు .