ఉరుకుల పరుగుల జీవితంలో ఒక్కరికి కూడా ఆరోగ్యం గురించి పట్టించుకునే సమయం లేకుండా పోయింది అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ప్రస్తుతం ఒత్తిడితో కూడిన జీవితంలో ముందుకు సాగుతున్న నేపథ్యంలో కనీసం సరైన ఆహార నియమాలను పాటించడంలో  కూడా ఎవరికి ఆసక్తి లేకుండా పోయింది. ఈ క్రమంలోనే ఆకలేసినప్పుడు తినడం నిద్ర వచ్చినప్పుడు పడుకోవడం లాంటివి చేస్తున్నారు.  వీటి కంటూ ఒక సరైన సమయం మాత్రం కేటాయించడం లేదు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఆహారపు అలవాట్లలో కూడా ఎన్నో తేడాలు వస్తున్నాయి.  ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన వంటి  వంటలు కాకుండా ఎక్కువగా రెస్టారెంట్ వంటలు మసాలాలు దట్టించిన వంటలు  ఎక్కువగా ఇష్టపడుతున్నారు.



 వెరసి రోజురోజుకు ఎన్నో ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు నేటి రోజుల్లో జనాలు అయితే..  సమయం సందర్భం లేకుండా ఇష్టం వచ్చిన ఆహారం తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో చెడు జరుగుతుంది అని నిపుణులు ఎప్పటి కప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయితే ఉదయం లేచిన తర్వాత  పరగడుపున మంచినీరు తాగితే ఎంతో మంచిది అని చెబుతూ ఉంటారు.  అదే సమయంలో ఉదయం లేచిన తర్వాత పరగడుపున తీసుకోకూడని కొన్ని ఆహారాలు కూడా ఉన్నాయి. పరగడుపున లేవగానే కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం ద్వారా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్లే అని చెబుతున్నారు నిపుణులు.




 ఉదయాన్నే పరగడుపున లేవగానే పచ్చి అరటి కాయ తింటే రక్తంలో మెగ్నీషియం స్థాయి ఒక్కసారిగా పెరిగిపోతుందట.  ఇక ఇలా మెగ్నీషియం స్థాయి పెరిగి పోవడం గుండెకు చేటు చేస్తుందని నిపుణులు అంటున్నారు. కారం మిరపకాయ మిరియాలు లవంగాలు పరగడుపున తింటే గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చి  ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందట. అంతేకాకుండా ఉదయాన్నే సిట్రిక్ ఫ్రూట్స్ తింటే.. ఎసిడిటి  ఫామ్ అవుతుందట. ఉదయం లేవగానే పచ్చి ఆకు కూర తింటే ఇక జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుందట. అంతేకాకుండా స్వీట్లు చక్కెర క్యాండీలు లాంటివి తింటే లివర్ పై ఎఫెక్ట్  పడుతుందట ఇక ఉదయం లేవగానే ఆల్కహాల్ తాగితే రక్తనాళాలు మెదడుపై ప్రభావం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: