మహారాష్ట్రలో కరోనా కలకలం కొనసాగుతోంది. అక్కడ కొత్తగా 8 వేల 623 పైచిలుకు కరోనా కేసులు నమోదయ్యాయి. ఇలా జరగడం ఇది వరుసగా నాలుగోసారి. 51 మంది చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3 లక్షల 30 వేల మంది హోం క్వారంటైన్‌లో ఉండగా.. 3084 మంది ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నారు. కరోనా కట్టడి కోసం అక్కడి ప్రభుత్వం అమరావతిలో లాక్‌డౌన్‌ను మార్చి 8 వరకూ పొడిగించింది. ముంబైలో నిబంధనలను విరుద్ధంగా వ్యవహరించిన ఫంక్షన్ హాళ్లపై చర్యలు చేపట్టాయి.
మహారాష్ట్ర తర్వాతి స్థానంలో కేరళ ఉంది. ఇక్కడ కొత్తగా 3 వేల 792 కరోనా కేసులు వచ్చాయి. 18 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నా.. కేసులు మాత్రం తగ్గడం లేదు. ఇక పంజాబ్‌లో 595 కరోనా కేసులు వచ్చాయి. దేశంలో నమోదు అవుతున్న మొత్తం కేసుల్లో 80 శాతం ఈ రాష్ట్రాల నుంచే వస్తున్నాయ్.
ఇక కేసులు అధికంగా వస్తోన్న రాష్ట్రాలపై కేంద్రం దృష్టి పెట్టింది. ఆయా రాష్ట్రాల సీఎస్‌లతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా సమీక్ష జరిపారు. మహారాష్ట్ర, పంజాబ్, చత్తీస్‌గఢ్, తెలంగాణ, మధ్యప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు. అటు ఒడిశా కూడా అలర్ట్ అయింది. కరోనా తీవ్రత అధికంగా ఉన్న ఐదు రాష్ట్రాల నుంచి వచ్చే వారిపై ఆంక్షలు విధించింది. మొత్తంగా కరోనా మళ్లీ విస్తరిస్తోంది. ఇందుకు కొత్త వేరియంట్ల కంటే సూపర్ స్పైడర్ ఈవెంట్లే కారణమంటున్నారు నిపుణులు. ఇటీవలి కాలంలో పెద్దసంఖ్యలో జనం పాల్గొనే కార్యక్రమాలు ఎక్కువవడంతోనే ఈ కేసులు పెరుగుతున్నాయని.. ఇప్పటికైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి