ఇక్కడ ఇలాంటి తరహా దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ముగ్గురు పిల్లలు ఉన్న ఓ మహిళ ఏకంగా 15 ఏళ్ల బాలుడు తో పారిపోయిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరక్ పూర్ లో చోటుచేసుకుంది. గోరక్ పూర్ సమీపంలోని కంపియ గంజా కు చెందిన ఓ వివాహితకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే అదే ప్రాంతానికి చెందిన ఏడో తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలుడు ఇక ఆ మహిళ ఇంటికి తరచూ వస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే ఆ బాలుడి పై కన్నేసిన మహిళ అతడితో పరిచయం పెంచుకుంది.. మాయమాటలు చెప్పి కామ కోరికలు తీర్చుకుంటూ ఉండేది.
ఈ క్రమంలోనే ఇక ఎవరూ వద్దు ఆ మైనర్ బాలుడు ఉంటే చాలు అనుకుంది సదరు మహిళ. ఇక ఇటీవల ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. బాలుడిని తీసుకుని పరార్ అయింది. అయితే బాలుడు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు.. ఈ విషయం బయటకి పొక్కకుండా కుర్రాడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆచూకీ లభించకపోవడంతో చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం ఇక పారిపోయిన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి