హైదరాబాద్: ప్రపంచంలో అగ్రరాజ్యంగా పిలువబడుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నిక నేడు జరగనున్నది. అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు బారక్ ఒబామా, రోమ్నీలు పోటీ పడుతున్నారు. పోటా పోటీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఒకరి ఓటు బ్యాంకును మరొకరు కొల్లగొట్టేందుకు ఇద్దరూ ముమ్మరంగా ప్రచారం చేశారు. అమెరికాలో నిర్వహించిన ఓ ఎగ్జిట్ పోల్ సర్వేలో రోమ్నీ ముందున్నట్లు తేలింది. అధ్యక్ష పదవితో పాటు, ప్రతినిధుల సభలోని అన్ని స్థానాలకు, ఎగువ సభ అయిన సెనేట్‌లోని మూడో వంతు స్థానాలకు, కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్ స్థానాలకు కూడా పోలింగ్ జరగనుంది. ఏడాదిన్నరగా సాగిన ప్రచారపర్వం చివర్లో గతంలో ఎన్నడూ లేనంతగా వేడెక్కించింది. ప్రచారం చివరి రోజుల్లో శాండీ తుపాను అమెరికాలోనే కాక.. ఒబామా వర్గంలోనూ అలజడి స్రుష్టించిది. శాండీ విధ్వంసం వల్ల కలిగిన అంతరాయం ప్రచారానికి బ్రేక్ వేసింది. అయినప్పటికీ ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా, రిపబ్లికన్ పార్టీ తరఫున ఆయన ప్రత్యర్థిగా బరిలోకి దిగిన మిట్ రోమ్నీలు ధాటిగానే వాగ్భాణాలను సంధించుకున్నారు. అమెరికా ఆర్థికాభివద్ధిలో కీలక పాత్ర పోషించిన భారత సంతతి ప్రజలు,ఇప్పుడు పాలనా వ్యవహారాల్లోనూ, ప్రస్తుత అధ్యక్ష ఎన్నికల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: