శివసేన చీఫ్ బాల్థాక్రే ఆరోగ్యంపై వస్తున్న వార్తల నేపథ్యంలో ముంబైలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసులకు సెలవులు రద్దు చేశారు. థాకరే నివాస ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. మొత్తం 48వేల మంది పోలీసులతో ముంబై ఖాకీ వనంగా మారింది. థాకరే చికిత్స పొందుతున్న లీలావతి ఆస్పత్రి వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు. శివసేన కార్యకర్తలను నియంత్రిస్తున్నారు. పలు ఎంఎంటీఎస్ రైళ్లను నిలిపివేశారు. ట్రాఫిక్కు కూడా అంతరాయం కలుగుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది అభిమానులు అక్కడికి తరలివస్తున్నారు. ఠాక్రే ఇంటి ఆవరణలో టెంట్లు, మైకులు ఏర్పాటు చేస్తున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: