అయితే వేసవిలో భగభగ మండిపోతున్న సూర్యుడి ప్రతాపం నుంచి తప్పించుకోవాలంటే కొన్ని రకాల జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అని ఆరోగ్య నిపుణులు కూడా సూచిస్తూ ఉంటారు ముఖ్యంగా సమ్మర్ లో దొరికే పుచ్చకాయ తినడం వల్ల ఎంతో ఉపశమనం ఉంటుంది అని కూడా చెబుతూ ఉంటారు.అంతే కాకుండా ఎంతో మంది ఇక సూర్యరశ్మి నుంచి తప్పించుకోవడానికి వేడి నుంచి శరీరాన్ని చల్లబరచ డానికి ఎక్కువగా మజ్జిగ తాగడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు ఎంతమంది. ఎండాకాలంలో ఎక్కడ చూసినా కూడా మజ్జిగ దుకాణాలు కనిపిస్తూ ఉంటాయి అనే విషయం తెలిసిందే.
అయితే వేసవికాలంలో సూర్యుడి ప్రతాపం నుంచి తప్పించుకోవడానికి ఎక్కువగా మజ్జిగ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అని చెబుతున్నారు నిపుణులు. మజ్జిగ తాగడం వల్ల వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది అని అంటున్నారు. అంతేకాకుండా శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉండేందుకు మజ్జిగ తాగితే ఎంతగానో ఉపయోగం ఉంటుందని అంటున్నారు. వేసవి కాలంలో మజ్జిగ తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొలస్ట్రాల్ ను తగ్గించడమే కాదు రక్త సరఫరా కూడా మెరుగవుతుందట. అంతే కాదు తరచు మజ్జిగ తాగడం వల్ల అటు చర్మం కాంతివంతంగా మారుతుంది అని చెబుతున్నారు నిపుణులు. శరీరానికి కాల్షియం అంది ఇక దంతాలు జుట్టు కూడా ఎంతో దృఢంగా మారుతాయట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి