అయితే నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో మాత్రం చెల్లని ఓట్లు అధికారులను సైతం విస్మయానికి గురి చేయడం గమనార్హం. కేవలం వందల సంఖ్యలో కాదు వేల సంఖ్యలో కాదు ఇరవై వేలకు పైగా ఓట్లు చెల్లని ఓట్లు మిగిలిపోయాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. డిగ్రీ పట్టా పొందిన ప్రతి ఒక్కరు ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించి ఇక ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు వేసి సరైన నాయకుడుని ఎన్నుకునేందుకు ముందుకు వచ్చినప్పటికీ సరిగ్గా ఓటు వేయకపోవడంతో వారి ఓట్లు చెల్లని ఓట్లు గా మిగిలి పోవడం జరిగింది.
కేవలం నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఏకంగా ఏడు రౌండ్లు ముగిసేసరికి 21 వేలకుపైగా చెల్లని ఓటు నమోదు కావడం గమనార్హం. అయితే మునుపెన్నడూ కూడా ఈ రేంజిలో చెల్లని ఓట్లు నమోదు కాలేదు అని చెప్పాలి. అయితే అభ్యర్థుల ఓట్లు ఈ రేంజ్లో చెల్లుబాటు కాకుండా ఉండటం సిగ్గుచేటు అంటూ అటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కొంత మంది విశ్లేషకులు. అయితే ఓటు వేసినప్పటికీ నిర్లక్ష్యంగా సరిగా వేయకపోవడంతో చెల్లని ఓట్లు గా మిగిలి పోతే ఇక డిగ్రీ చదివిన ఏం లాభం అంటూ విశ్లేషకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి