చైనాలో వెలుగులోకి వచ్చిన మహమ్మారి కరోనా వైరస్ ఇప్పటికే ప్రపంచ దేశాలను ఎంత అతలాకుతలం చేసింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  అయితే మొదట్లో కరోనా వైరస్ గురించి ప్రపంచ దేశాలకు అవగాహన లేకపోవడంతో ఇక అన్ని దేశాలు లైట్ తీసుకున్నాయి. ఇక ఆ తర్వాత క్రమక్రమంగా కేసుల సంఖ్య పెరిగి పోవడం ఎంతో మంది ఈ మహమ్మారి వైరస్ బారినపడి చనిపోవడంతో ఈ వైరస్ విషయంలో అప్రమత్తమయ్యాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఎంత అప్రమత్తం అయినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో భారీగా కేసులు కూడా నమోదయ్యాయి.



 ఇక ఆ తర్వాత ఆయా దేశాల ప్రభుత్వాలు  వైరస్ ను కంట్రోల్ చేసేందుకు ఎంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగడంతో కరోనా వైరస్ ప్రభావం కాస్త తగ్గింది.  ఇకపోతే కరోనా వైరస్ ప్రభావం తగ్గింది అని అందరూ సంతోష పడుతున్న తరుణంలో మనుషుల ప్రాణాలు బలి తీసుకోవడానికి ఎన్నో రకాల కొత్త మహమ్మారి వ్యాధులు దూసుకు వస్తూనే ఉన్నాయి.  ఒక వ్యాధి పోయింది అని సంతోషపడే లోకి మరో వ్యాధి దూసుకువచ్చి ఎంతోమంది ప్రాణాలను హరిస్తుంది. అయితే ఈ ఇటీవలే ఆస్ట్రేలియాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గింది అని అనుకుంటున్న సమయంలో..  ఇక ఇప్పుడు ఆస్ట్రేలియాను ఎలుకల ప్లేగు వ్యాధి వణికిస్తోంది.



 ఆస్ట్రేలియా లో భారీ సంఖ్యలో ఎలుకలు ప్లేగు వ్యాధి బారిన పడుతూ ఉండడం అక్కడి ప్రజలందరినీ కూడా బెంబేలెత్తిస్తోంది. తాజాగా గిల్ గ్రండా లోని  ఓ ప్రాంతంలో ఉన్న పొలంలో ఏకంగా వేల సంఖ్యలో ఎలుకలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పరుగులు తీస్తు కనిపించడం ఆసక్తికరంగా మారిపోయింది. ఇక భారీ సంఖ్యలో ఎన్నికలు పరిగెడుతుంటే భూమి అదిరి నట్లుగా అనిపిస్తుందని ఏకంగా భూకంపం వచ్చినట్లు తాము భయపడ్డాము అంటూ స్థానికులు చెబుతూ ఉన్నారు. అయితే దీనికి ఎప్పుడు చెక్ పడుతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: