ఇక క్యాబ్లో వెళ్తున్న సమయంలో మార్గమధ్యంలోకి వెళ్ళగానే ఇక క్యాబ్ డ్రైవర్ ను దారుణంగా హత్య చేసి ఆ ఫేస్బుక్ ప్రేమికులు కాస్త క్యాబ్ తో పరారయ్యారు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు చివరికి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. రెండేళ్ల క్రితం ఢిల్లీకి చెందిన శివకుమార్ కు ఇంతియాజ్ ఖానం ఫేస్బుక్ లో పరిచయం అయింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే ఇటీవలే ఫిబ్రవరి 4వ తేదీన ఆఫ్జల్ గంజ్ ప్రాంతంలోని ఓ లాడ్జిలో దిగారు ఈ ప్రేమికులు.
ఇక ఆ తర్వాత నాంపల్లి రైల్వే స్టేషన్ కు వెళ్లి అక్కడి నుంచి బీదర్ వెళ్లేందుకు ఒక క్యాబ్ బుక్ చేసుకున్నారు. దీనికోసం 2500 రూపాయలు చెల్లించేందుకు సిద్ధమయ్యారు. ఇక క్యాబ్లో బీదర్ వెళ్లేందుకు సిద్ధం అవుతుండగా మార్గమధ్యంలో లింగంపల్లి కి వెళ్ళిన తర్వాత రవి అనే వ్యక్తి కూడా కారులో ఎక్కాడు. క్యాబ్ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంతియాజ్ ఖానం టాయిలెట్ వస్తుంది అంటూ చెప్పడంతో ఇక క్యాబ్ డ్రైవర్ అస్లాం ఖాన్ క్యాబ్ పక్కకి ఆపాడు. ఈ క్రమంలోనే వెనుక కూర్చున్న శివ కుమార్ కేబుల్ వైర్ క్యాబ్ డ్రైవర్ మెడకు బిగించాడు. దీంతో గొంతునులిమి చంపేశాడు. మృతదేహాన్ని అక్కడే పడేసి ముగ్గురు క్యాబ్ తో పరారయ్యారు. తర్వాత 14000 లకు క్యాబ్ అమ్మేసారు. అస్లాం ఖాన్ కనిపించకపోవడంతో కంగారు పడిపోయినకుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి